• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో .. ఆ నిర్మాతకు గాయాలు !

|
  AP Assembly Elections 2019 : బాలయ్య ఎన్నికల ప్రచారం... ఓ నిర్మాతను ఆస్పత్రి పాలు చేసింది || Oneindia

  ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ప్రధాన పార్టీలన్నీ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టిడిపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి నందమూరి తారక రత్న, నారా రోహిత్ లు రంగంలోకి దిగారు. ఇక జనసేన తరపున నాగబాబు కుమార్తె నటి నిహారిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మోహన్ బాబు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు స్టార్ క్యాంపెయినర్ లతో ప్రచారం చేస్తూ 11న జరిగిన పోలింగ్ లో అమీ తుమీ తేల్చుకోనున్నాయి.

  నాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తి

   బాలయ్య కోసం ప్రచారానికి వచ్చి గాయపడిన సహ నిర్మాత

  బాలయ్య కోసం ప్రచారానికి వచ్చి గాయపడిన సహ నిర్మాత

  హిందూపురం నుండి ఎమ్మెల్యే గా బరిలోకి దిగిన బాలకృష్ణ కు బాసటగా నిలవడానికి, ప్రచారం నిర్వహించడానికి వచ్చిన సహ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వర్లు ప్రచారం విషయం అటుంచి, ఆసుపత్రి పాలయ్యారు. బాలకృష్ణ ప్రచారం కారణంగా ఓ సినీ నిర్మాత గాయాలపాలయ్యారు. ఈ సంఘటన హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంది.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారంలో పాల్గొనడానికి సహ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వర్లు వచ్చారు. ప్రచార సమయంలో బాలకృష్ణ తో పాటుగా ప్రచార రథం పైకి ఎక్కే క్రమంలో ప్రచార వాహనం ముందుకు కదలడంతో ఆయన ప్రమాదానికి గురయ్యారు. గాయాలపాలయ్యారు.

  ప్రచార రధం ఎక్కే సమయంలో ఘటన .. కొమ్మినేని మణికట్టు ఫ్రాక్చర్

  ప్రచార రధం ఎక్కే సమయంలో ఘటన .. కొమ్మినేని మణికట్టు ఫ్రాక్చర్

  చిలమత్తూరు మండలం మడంపల్లి వద్ద ప్రచారంలో ఉన్న బాలకృష్ణ తో పాటు ప్రచార రథం ఎక్కేందుకు ప్రయత్నించైనా క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనం ముందుకు కదలడంతో కిందపడ్డ ఆయన ఎడమ చేతికి దెబ్బతగిలింది. దాంతో ఆయనను హిందూపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే కొమ్మినేని వెంకటేశ్వర్లు మణి కట్టు చేతి భాగానికి దెబ్బ తగిలిందని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. పాపం ... బాలయ్య ప్రచారం కోసం వచ్చిన సహ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వర్లు ఆస్పత్రి పాలయ్యారు.

  ఈసారి ఎన్నికల ప్రచారంలో బాలయ్యకు అన్నీ చిక్కులే

  ఈసారి ఎన్నికల ప్రచారంలో బాలయ్యకు అన్నీ చిక్కులే

  మొన్నటికి మొన్న బాలకృష్ణ తన ప్రచారంలో కొందరు పిల్లలు కాన్వాయ్‌కు అడ్డుగా రావడంతో.. బాలయ్య సెక్యురిటీ సిబ్బంది వారిని పక్కకు లాక్కెళ్లారట. ఈ సీన్‌ను ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి వీడియో తీశాడు. దీనిని గమనించిన బాలయ్య అతనిపై చేయి చేసుకున్నారు. వీడియో జర్నలిస్టుపై చేయి చేసుకున్న సినీ హీరో, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య తీరుపై విమర్శలు రావడంతో తన తప్పును గ్రహించారు. సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని.. మీడియా మిత్రులకు బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నానన్నారు బాలయ్య. ఇక ఆ ఘటనతో ఇబ్బంది పడిన బాలకృష్ణ , ఇక ఇప్పుడు ఆయన కోసం ప్రచారానికి వచ్చిన సహనిర్మాత గాయాలపాలు కావటంతో మరోసారి ఇబ్బంది పడుతున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The political heat peaks in the AP now. Co-producer Venkateshwara rao were wounded in an accident held in balayya campaign . Venkateshwara rao who came out to promote Balayya in the Hindupur met with an accident .Venkateswar rao wounded his wrist with the vehicle moving forward when he wanted to get in the campaign convoy. The doctors said he need surgery and now he is in hospital .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more