ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిసార్టులో అమ్మాయిలతో చిందులు: మంత్రి బాలినేని కీలక అనుచరుడి బర్త్ డే పార్టీ(వీడియో)

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివా'స్ రెడ్డి అనుచరుడి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అమ్మాయిలతో చిందులు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై పలువురు టీడీపీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

రిసార్టులో బర్త్ డే పార్టీ..

రిసార్టులో బర్త్ డే పార్టీ..

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు నల్లమలపు కృష్ణారెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి తన పుట్టినరోజు సందర్బంగా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పార్టీ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన కొత్తపట్నంలో ఉన్న నల్లూరి గార్డెన్ రిసార్ట్‌లో వీరంతా పార్టీ చేసుకున్నారు.

అమ్మాయిలతో చిందులు..

అమ్మాయిలతో చిందులు..

కాగా, బర్త్ డే పార్టీ సందర్భంగా రిసార్టుకు కొంతమంది అమ్మాయిలను కూడా తీసుకొచ్చారు. వారితో చిందులు వేసుకుంటూ పార్టీ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పార్టీలకు అనుమతి ఎలా ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు.

వీడియోలు షేర్ చేస్తూ టీడీపీ విమర్శలు..

వీడియోలు షేర్ చేస్తూ టీడీపీ విమర్శలు..

మంత్రి అనుచరుడు కావడంతో వదిలేస్తారా? అంటూ స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులు ఈ వీడియోలను షోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

రేవ్ పార్టీ వైరల్ అంటూ.,

‘మంత్రి బాలినేని అనుచరుడు నల్లమలుపు కృష్ణ రెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి హల్చల్.. తన బర్త్డే కు రేవ్ పార్టీ పెట్టిన కృష్ణారెడ్డి. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం నల్లూరి గార్డెన్ రిసార్ట్లో రేవ్ పార్టీ. వైరల్ అవుతున్న వీడియోలు' అంటూ మద్దిన ఈశ్వరయ్య అనే టీడీపీ అభిమాని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

English summary
balineni srinivasa reddy's follower's birthday party: leaders dances with girls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X