వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అసెంబ్లీలో మీడియాపై నిషేధం: స్పీకర్ కు చంద్రబాబు లేఖ,జగన్ కు భయమన్న అచ్చెన్న

|
Google Oneindia TeluguNews

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మీడియా పై నిషేధం విధించడం పై టిడిపి చీఫ్, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై నిషేధిత రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు శాసనసభ కార్యక్రమాలు యథాతథంగా ప్రజలకు తెలియజేసే అవకాశం కల్పించాలని, మీడియా పాయింట్ ను పునరుద్ధరించాలని చంద్రబాబు స్పీకర్ తమ్మినేని సీతారాం కు లేఖ ద్వారా వివరించారు.

పార్లమెంట్ సమావేశాలకు లేని నిషేధం ఇక్కడ ఎందుకు ? స్పీకర్ కు లేఖలో చంద్రబాబు

పార్లమెంట్ సమావేశాలకు లేని నిషేధం ఇక్కడ ఎందుకు ? స్పీకర్ కు లేఖలో చంద్రబాబు

మీడియా పాయింట్ ను తీసేస్తూ ఆదేశాలివ్వడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు చంద్రబాబు. పార్లమెంటు సమావేశాలకు మీడియాని అనుమతించారని అక్కడ లేని నిషేధం ఇక్కడ ఎందుకు విధిస్తున్నారు అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. వైసిపి ప్రభుత్వం జీవో 2430 ద్వారా మీడియా హక్కులను హరిస్తోంది అని సర్కార్ కు వ్యతిరేకంగా వార్తలు శిక్షించాలని ఉత్తర్వులు ఇస్తోందని దీనిని జాతీయ మీడియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అంటూ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా తప్పు పట్టింది అన్నారు.

ఇది దారుణమైన చర్య అన్న టీడీపీ అధినేత

ఇది దారుణమైన చర్య అన్న టీడీపీ అధినేత

ఇప్పుడు సమావేశాలకు నిషేధం విధించటం దారుణమైన చర్య మరి చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. టిడిపి హయాంలో 1995లో చట్టసభల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించాము అని అప్పుడు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ చర్చలను ప్రచారం చేసి ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ప్రజలకు చాటి చెప్పారని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. టీడీపీ ప్రారంభించిన శాసన సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం లోక్సభ, రాజ్యసభలలో ప్రారంభమైందని, ఇప్పటికీ చాలా రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయంటూ చంద్రబాబు గుర్తు చేశారు.

సీఎం జగన్ రెడ్డి తుగ్లక్ పాలన దాచాలని ఇదంతా : అచ్చెన్నాయుడు

సీఎం జగన్ రెడ్డి తుగ్లక్ పాలన దాచాలని ఇదంతా : అచ్చెన్నాయుడు

చట్ట సభల నిర్వహణ జరిగే చర్చలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకం కావడంతో ఈ అసెంబ్లీ సమావేశాలకు మీడియాను అనుమతించాలని ఆయన తన లేఖ ద్వారా స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ను అడ్డంపెట్టుకుని సీఎం జగన్ రెడ్డి తన తుగ్లక్ పాలన దాచాలని చూస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీలో మీడియాను అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన పాఠశాలలకు , మద్యం దుకాణాలకు అడ్డురాని కరోనా మీడియాపాయింట్ అనుమతికి అడ్డొస్తుందా అంటూ ప్రశ్నించారు.

Recommended Video

AP Cabinet Key Decisions పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి రూ.500, డిసెంబర్ 15 కల్లా పంటనష్టం అంచనా..!
 జగన్ బండారం బయటపడుతుందనే అన్న టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు

జగన్ బండారం బయటపడుతుందనే అన్న టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు

వైసీపీ నేతలకు ధైర్యముంటే అసెంబ్లీలో మీడియా పాయింట్ అనుమతికి ఓకే చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అంటే జగన్ భయపడుతున్నారన్న అచ్చెన్నాయుడు మీ బండారం బయట పడుతుందని ఆందోళన చెందుతున్నారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు సంక్షేమ పథకాలు భూ ఇసుక మద్యం మాఫియా లో వేల కోట్లు చేతులు మారుతున్నాయని ,అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పక్కదారి పట్టించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపణలు చేశారు అచ్చెన్నాయుడు.

English summary
TDP chief Chandrababu Naidu has written a letter to the Assembly Speaker on the ban on the media in the wake of the AP Assembly winter sessions from today. TDP state president Atchennaidu was outraged at the YCP government's attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X