వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేబండారు: లోకసభకి ఆదాల?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bandaru joins in Telugudesam
ఏలూరు: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానంద రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం పచ్చజెండా కప్పుకున్నారు. ఆయనకు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రజా గర్జనలో సత్యానంద రావుతోపాటు పలువురు నేతలు కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, అందుకే తెలుగుదేశం అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నట్టు సత్యానంద రావు చెప్పారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గుడిపూడి రవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన రాజును కూడా పార్టీలో చేర్చుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఆదాల?

నెల్లూరు లోక్‌సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా ఆదాల ప్రభాకర రెడ్డిని ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన టిడిపిలో చేరే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. ముందు ఆయనను నెల్లూరు రూరల్ అభ్యర్థిగా నిలపాలని అనుకొన్నా ఆదాల ఎంపీ సీటుపై ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు చంద్రబాబు కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

27న డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రకటన

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఈ నెల 27న తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. డిఎల్ రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 27 నాటికి 35 సంవత్సరాలు అవుతోంది. అదేరోజు ఆయన నిర్ణయం తీసుకోనున్నారు.

English summary
Congress Senior MLA Bandaru Satyananda Rao joined in Telugudesam Party on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X