వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొంతు కోసుకుంటానా: తూచ్‌..అవ‌న్నీ అవుతాయా : ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ లో అలా..

|
Google Oneindia TeluguNews

బండ్ల గణేష్ ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాక‌పోతే గొంతు కోసుకుంటాన‌ని శ‌ప‌థం చేసారు. ఫ‌లితాలు వ‌చ్చి వారం అవ‌తున్నా..ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. తిరుమ‌ల లో శ్రీవారి ద‌ర్శ‌నం త‌రువాత తాను అప్పుడు చేసిన వ్యాఖ్య‌ల పై ఇప్పుడు వెరైటీగా స్పందించి..అంతా తూచ్ అన్నారు..

బండ్ల గ‌ణేస్. తెలంగాణ ఎన్నిక‌ల ముందు సంచ‌లన వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. రాహుల్ గాంధీ స‌మక్షంలో కాంగ్రెస్ లో చేరిన బండ్ల గ‌ణేష్ కు కాంగ్రెస్ టిక్కెట్ సైతం ఇవ్వ‌లేదు. అయినా..కాంగ్రెస్ గెలుస్తుంద‌ని చాలా ధీమా వ్య‌క్తం చేసేవారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫ‌లితాలు వ‌చ్చినప్ప‌టి నుండి క‌నిపించ‌ని బండ్ల గణేష్..

Bandla Ganesh Reaction : for build confidence in party workers..

ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై స్పందించా రు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన బండ్ల గణేష్ అక్కడ మీడియాతో మాట్లాడు తూ... గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యల గురించి మీడియా ప్రస్తావించగా.. ''కోపంలో చాలా మంది చాలా అంటారు. అవన్నీ అవుతాయా? మా పార్టీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి అలా అన్నాను. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది.'' అని బదులిచ్చేసారు.

ఇక‌, తాను అజ్ఞాతంలోకి వెళ్లాన‌నే వార్త‌ల మీదా బండ్ల స్పందించారు. నేను అజ్ఞాతంలో ఉన్నానని అంటున్నారు. నేనేం అజ్ఞాతంలో లేను. మేము ఊహించని విధంగా మా పార్టీ ఓడిపోయింది కాబట్టి మానసికంగా బాధతో ఉన్నాం. ఇలాంటప్పుడు ఏం మాట్లాడతాంలే.. ప్రజలు మనల్ని తిరస్కరించారు. కాబట్టి మనం మౌనంగా ఉండాలి. మాట్లాడ డానికి ఇది సరైన సమయం కాదని ఊరుకున్నా...అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. నేటి ఓటమే రేపటి విజయానికి పునాది అని బండ్ల వ్యాఖ్యానించి త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకొనే ప్ర‌య‌త్నం చేసారు బండ్ల గ‌ణేష్‌.

English summary
Bandla Ganesh Reacted on his comments before Telangana Results. He stated to build confidene in Party workers he used that dialogues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X