వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు భారీ షాక్ ... ఆస్తుల జప్తుకు నోటీసులు

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్ ఇచ్చింది కరూర్ వైశ్యా బ్యాంకు . గీతం సంస్థల అధినేత శ్రీ భరత్‌ ఆస్తుల జప్తుకే ఏకంగా సిద్ధం అయ్యింది .బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు చెల్లించని కారణంగా భరత్ తండ్రి పట్టాభి రామారావు, చిన్నాన్న లక్షణరావు, ఇతర కుటుంబ సభ్యులకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై శ్రీ భరత్ స్పందించకపోవడంతో.. ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమైంది బ్యాంక్.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Bodo Agreement | Coronavirus
భూములను తాకట్టు పెట్టి.. దాదాపు రూ.124 కోట్ల రుణాలు తీసుకున్న శ్రీ భరత్ కుటుంబం

భూములను తాకట్టు పెట్టి.. దాదాపు రూ.124 కోట్ల రుణాలు తీసుకున్న శ్రీ భరత్ కుటుంబం

గతంలో ఆంధ్రాబ్యాంక్ విషయంలో కూడా శ్రీ భరత్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించటం లేదని వచ్చిన ఆరోపణలకు అప్పుడు శ్రీ భరత్ స్పందించారు. తమ సంస్థకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రానందున బ్యాంకు రుణాలు చెల్లించటం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఇక తాజాగా టెక్నో యూనిట్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట శ్రీ భరత్ కుటుంబం వైజాగ్‌లోని గాజువాక, భీమిలీలోని భూములను తాకట్టు పెట్టి.. దాదాపు రూ.124 కోట్లకు పైగా డబ్బును అప్పుగా తీసుకున్నారు.

 ఆస్తుల జప్తుకు నోటీసులు ఇచ్చిన బ్యాంకు

ఆస్తుల జప్తుకు నోటీసులు ఇచ్చిన బ్యాంకు

కానీ అప్పు చెల్లించటంలో మాత్రం విఫలం అయ్యారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ వడ్డీ కూడా కట్టకపోవడంతో.. బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ అప్పును 21.01.2020 నాటికి కంపెనీ పేరిట తీసుకున్న వడ్డీతో కలిపి అసలు కూడా కలిపి చెల్లించాలని నోటీసులో తెలిపింది బ్యాంకు. దాదాపు రూ.124,39, 21 వేలు తిరిగి చెల్లించాలని లేని పక్షంలో తాకట్టుపెట్టిన ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులో పేర్కొంది బ్యాంకు.

ఆస్తుల జప్తు నోటీసుతో శ్రీ భరత్ కు షాక్

ఆస్తుల జప్తు నోటీసుతో శ్రీ భరత్ కు షాక్

టెక్నో యూనిట్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట శ్రీ భరత్ కుటుంబం వైజాగ్‌లోని గాజువాక, భీమిలీలోని భూములను తాకట్టు పెట్టి.. దాదాపు రూ.124 కోట్లకు పైగా డబ్బును అప్పుగా తీసుకున్నారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ వడ్డీ కూడా కట్టకపోవడంతో.. బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ అప్పును 21.01.2020 నాటికి కంపెనీ పేరిట తీసుకున్న వడ్డీతో కలిపి అసలు కూడా కలిపి చెల్లించాలని నోటీసులో తెలిపింది బ్యాంకు. దీంతో ఆస్తులు జప్తు చేసే దాకా బ్యాంకులు నిర్ణయం తీసుకోవటంపై శ్రీ భరత్ ఏమంటారో వేచి చూడాలి.

English summary
Karur Vysya Bank shocked TDP leader, Hindupuram MLA Balakrishna's youngest son in law Sri Bharat. Shri Bharat, has been preparing for the foreclosure of the assets. Since Sri Bharat has not responded to the loan payments notice, the bank is ready for a foreclosure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X