అమరావతికి రూ.3 వేల కోట్లివ్వండి-రాజధానిగా ఉంటుందా ? జగన్ సర్కార్ కు బ్యాంకుల ప్రశ్న
ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును మొదట్లో తప్పుబట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు క్రమంగా దాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. మొదట్లో అప్పీలుకు కూడా వెళ్తామని చెప్పుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఆలోచనలు విరమించుకుని హైకోర్టు తీర్పు అమలు చేస్తోంది. దీని ప్రకారం ఇప్పటికే రైతులకు ఫ్లాట్ల పంపిణీ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పుడు మౌలిక సౌకర్యాల అభివృద్ధికి సర్కార్ సిద్ధమైంది.

అమరావతిపై హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెచ్చేందుకు విఫలయత్నం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమరావతిలో రైతులకు గతంలో చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు రాజధానిలో మౌలిక సౌకర్యాల కల్పన కూడా చేపడుతోంది. హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు ఓవైపు పనులు చేపడుతున్న సర్కార్.. మరోవైపు గడువు పెంచాలని హైకోర్టును కోరుతోంది. దీంతో కనీస పనులు పూర్తి చేయకుండా హైకోర్టు కూడా గడువు పెంచే అవకాశాలు లేకపోవడంతో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి బ్యాంకుల్ని రుణాలు కోరుతోంది.

రూ.3 వేల కోట్ల రుణానికి యత్నాలు
అమరావతిలో రోడ్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన నిధులు ప్రభుత్వం పద్ద లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు సీఆర్డీయే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఆర్డీయే ఇచ్చిన ప్రతిపాదనలకు బ్యాంకుల నుంచి సానుకూల స్పందనే వచ్చినట్లు తెలుస్తోంది. అమరావతిలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం మొత్తం రూ.3 వేల కోట్ల రుణం ఇవ్వాలని సీఆర్డీయే ఇచ్చిన ప్రతిపాదనపై బ్యాంకుల నుంచి సమాధానం కూడా వచ్చింది.

డీపీఆర్ లు అడిగిన బ్యాంకులు
అమరావతిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం కావాల్సిన రూ.3 వేల కోట్ల రుణం కోసం సీఆర్డీయే నుంచి వచ్చిన ప్రతిపాదనలపై స్పందించిన బ్యాంకులు దీన్ని రెండుగా విభజించి ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని సూచించాయి. దీంతో వీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అమరావతిలో ఇప్పటికే ప్రారంభించి పూర్తికాని ప్రాజెక్టులే ఇందులో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త ప్రాజెక్టుల్ని కూడా కలిపి ఈ రుణం ఇవ్వాలని సీఆర్డీయే కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు సీఆర్డీయే సిద్దమవుతోంది.

రాజధాని మెలిక పెట్టిన బ్యాంకులు ?
మౌలిక
సౌకర్యాల
అభివృద్ధి
కోసం
ఏపీ
సర్కార్
అడుగుతున్న
రూ.3
వేల
కోట్ల
రుణం
ఇచ్చేందుకు
బ్యాంకులు
కీలకమైన
మెలిక
పెట్టాయి.
ఆర్బీఐ
నిబంధనల
ప్రకారం
రాష్ట్ర
రాజధాని
అభివృద్ధి
కోసం
రుణం
ఇస్తున్నందున
అమరావతే
రాజధానిగా
ఉంటుందని
బ్యాంకులకు
హామీ
ఇవ్వాల్సి
ఉంటుంది.
ఆ
హామీనే
బ్యాంకులు
ఇప్పుడు
సీఆర్డీయేను
అడుగుతున్నట్లు
తెలుస్తోంది.
అయితే
ప్రస్తుతానికి
అమరావతే
రాజధానిగా
అంగీకరించి
పనులు
చేపడుతున్నందున
ప్రభుత్వం
ఆ
మేరకు
హామీ
ఇచ్చి
రుణం
తీసుకునే
అవకాశాలు
కనిపిస్తున్నాయి.