విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు...రేపటి నుంచే ప్రారంభం:దేశవ్యాప్తంగా 650...ఎపిలో 24 బ్రాంచిల్లో సర్వ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి సెప్టెంబర్ 1 వ తేదీ శనివారం ఈ సేవలను ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ
బ్యాంకుల తరహాలోనే పోస్టాఫీసుల్లో ను బ్యాంకుల సేవలు అందించేందుకు సర్వం సిద్దం చేశామన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 650 పోస్టాఫీసు బ్రాంచిల్లో బ్యాంకు సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తొలివిడతగా 24 బ్రాంచిల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

Banking services in post offices ...start from tomorrow

అనంతరం విడతలవారిగా డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 10, 490 పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా బ్యాంకులు అందించే అన్ని రకాల సేవలతో పాటు మరికొన్ని అదనపు సౌకర్యాలు పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ వ్యవస్థలోను అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు(ఐపీపీబీ) తన సేవలను భారీగా విస్తృతపరచనున్నట్లు తెలిపారు.

ఈ పోస్టల్ బ్యాంకుల్లో కూడా ఇతర వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న సేవలతో పాటు అదనంగా ఉండే సేవల వివరాలు ఇవి. సేవింగ్స్‌, కరెంటు ఖాతాల ప్రారంభం, మొబైల్‌, ఈ-మెయిల్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డు సేవలు...ఇత్యాది బ్యాంకింగ్ సేవలతో పాటుగా...ఇంటికే బ్యాంకింగ్‌ సేవలు అన్న కొత్త విధానాన్నీ పోస్టల్ శాఖ తీసుకుంటోందని తెలిసింది. ఆ ప్రకారం టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు పోస్టల్ అధికారులు ఇంటికే వస్తారు.

పైగా పోస్టల్ బ్యాంకుల్లో కొత్త ఖాతాలను ఉచితంగా...అంటే జీరో ఓపెనింగ్‌ బ్యాలన్స్‌తో ప్రారంభించే సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ఆయా ఖాతాల్లో కనీస నిల్వ ఉండాలన్న నియమం కూడా ఏమీ ఉండదంటున్నారు. తద్వారా మినిమం బ్యాలన్స్‌ చార్జీలు విధించడాలు వంటివి కూడా ఉండవు. అలాగే మిస్డ్‌ కాల్‌ ఇస్తే ఖాతాల వివరాలు, బ్యాలన్స్‌లను సదరు ఖాతాదారుకు పంపించే ఏర్పాటును కూడా ఐపీపీబీ చేసింది. అదేవిధంగా ఈ బ్యాంకు ఖాతాలను పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాలతోనూ అనుసంధానం చేస్తారట. ఆయా ఖాతాల్లో ఉన్న సొమ్ము నుంచి అవసరమైన బిల్లుల చెల్లింపును ఈ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యం కల్పిస్తారు.

English summary
Vijayawada: Banking services in post offices will begin tomorrow. Prime Minister Narendra Modi will launch service on September 1. On this background AP chief post master general said that there are a total of 650 post offices across the country and 24 branches in Andhra Pradesh availble for these banking services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X