వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రద్దైన నోట్ల కోసం వెళ్ళి పోలిసులకు చిక్కారు

ఎటిఎంలలో బ్యాంకుల నుండి వచ్చిన ఇండెంట్ ప్రకారంగా డబ్బులు డిపాజిట్ చేయకుండా కొందరు కస్టోడియన్లు చేతివాటాన్ని ప్రదర్శించారు. సుమారు 9 మంది కోటి రూపాయాల నగదును నొక్కేశారు.విశాఖపట్టణంలో పోలీసులు అరెస్టు చ

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం :ఎటిఎంలలో డబ్బులను డిపాజిట్ చేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బ్యాంకుల నుండి తీసుకొన్న ఇండెంట్ మేరకు డబ్బులను ఎటిఎంలలో జమచేయకుండా స్వంతంగా వినియోగించుకొంటున్నారు.పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో వీరి వ్యవహరం బట్టయబయలైంది. ఎటిఎంల కస్టోడియన్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శించి కోటి రూపాయాలను స్వంతానికి వాడుకొన్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖపట్టణంలోని ఎస్ బి ఐ, హెచ్ డి ఎప్ సి తో పాటు మరికొన్ని బ్యాంకుల్లో డబ్బులను నింపే బాద్యతను మేనేజింగ్ సర్వీస్ ప్రోవైడింగ్ ఎంఎస్ పి) కి అప్పగించాయి బ్యాంకులు. ఈ బాధ్యతలను సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ సర్వీస్ అనే ఏజెస్సీకి అప్పగించింది.విశాఖలోని ఎటిఎంలను ఆరు రూట్లుగా విభజించి, ఆరు వాహనాలను ఏజెన్సీ కేటాయించింది.ఎటిఎంలలో డబ్బులను నింపేందుకు దాసరి శ్రీనివాస్, రాంబాబు, వెంకటేశ్వర్లు, గణేష్, వెంకట గౌతమ్, మనోజ్ కుమార్, లు కస్టోడియన్లుగా పనిచేసేవారు. వీరి చేతివాటం కారణంగా కోటి రూపాయాలు స్వాహా అయ్యాయి.

ఎటిఎంలలోని క్యాష్ చెస్ట్ తెరుచుకోవాలంటే ఇద్దరూ కస్టోడియన్ లు తమ పాస్ వర్డ్ లను ఉపయోగించాల్సి ఉంటుంది. కాని, ఏం జరిగిందో తెలియదు, ఒకరి పాస్ వర్డ్ మరొకరు తెలుసుకొన్నారో.. లేక ఇద్దరు కుమ్మక్కయ్యారో కాని,బ్యాంకులు ఇచ్చే ఇండెంట్ ఆధారంగా ఎటిఎంలలో పెట్టే నగదులో కొంత వీరే వాడుకొంటున్నారు.

మూడు సంవత్సరాల్లో సుమారు కోటి రూపాయాలను నొక్కేశారు.ఇండెంట్ ప్రకారంగా ఎటిఎంలకు డబ్బులు చేరినా ఎందుకు ఎటిఎం ల వద్ద ఎందుకు నగదు కొరత ఉందో అర్థం కాలేదోనని బ్యాంకర్లు తలలుపట్టుకొనే వారు.ఎటిఎంలలో డబ్బు నిల్వలపై అప్పుడప్పుడు బ్యాంకర్లు తనిఖీ చేసేవారు. బ్యాంకు అధికారులు తనిఖీ చేసే రూట్ వివరాలను తెలుసుకొని ఆయా ఎటిఎంలలో డబ్బులను సర్థేవారు.

 banned currency traceout atn thives

పెద్ద నగదు నోట్ల రద్దుతో కష్టం

పెద్ద నగదు నోట్ల రద్దుతో వీరికి కష్టం వచ్చింది. అప్పటికే సుమారు 70 లక్షలను జల్సాలకు వాడుకొన్నారు. మరో 30 లక్షలను ఇతర అవసరాలకు వాడుకొన్నారు. ఈ నగదును అంతా ఎటిఎంలలో సమకూర్చాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ కోటి రూపాయాలు కూడ రద్దయిన నగదు రూపంలోనే ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. బ్యాంకులకు పాత నగదును చేర్చాల్సిన సమయంలోపుగానే తాము ఈ నగదును ఎటిఎంలలో జమచేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

దీంతో పాత నగదు నోట్లను కమీసన్ రూపంలో తీసుకొనేందుకు కూడ వెనుకాడలేదు.20 లక్షల పాత నగదును మార్చేందుకు విజయవాడకు చెందిన వ్యక్తితో వీరికి డీల్ కుదిరింది.నవంబర్ 22న, విజయవాడ వెళ్ళాల్సి ఉంది. అయితే విజయవాడ వెళ్ళాల్సిన రైలును మిస్సయ్యారు.టిక్కెట్టు లేకుండా సువిధ రైలులో శ్రీనివాస్ ఎక్కాడు. టిక్కెట్టు లేకపోవడంతో పాటు ఆయన వద్ద 35 లక్షల నగదు ఉండడంతో పోలీసులు అరెస్టు చేశారు.

నగదుకు ఆధారాలు చూపలేదు. పోలీసులు విచారణ .జరిపితే అసలు విషయాలను బయటపెట్టారు.ఏజెన్సీ సక్రమంగా వ్యవహరించని కారణంగా ఈ తప్పులు జరిగాయి. కొన్ని రూట్లలో ఒక్కరే కస్టోడియన్ ఉండేవాడు. మరికొన్ని చోట్ల ఇద్దరున్నా ఒక్కరే డబ్బులను నింపే పనిలో ఉండేవాడు. దీంతో ఎటిఎంలలో నింపాల్సిన డబ్బు కస్టోడియన్లు తమ స్వంతానికి వాడుకొన్నారు.

English summary
banned currency trace out atm thieves in vizag. several banks agreement managing service providing for deposit in atms. scientific security management service agency takeover this rights.every route two custodians. they deposit every bank atm for the banks indent. but custodians didnot deposit as per banks indents. they theft some amount.last 3 years custodians roberry around 1 crore rupees.currency ban major effect this gang. banned currency custodians for deposit atms. they were deal a person in vijayawada.35 lakhs currency withour evidence travelling in train police arrested srinivas in rajamandry. srinivas tell everything about atm roberrys
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X