రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోదావరి బండ్‌పై బాపు, రమణల విగ్రహాలు: ఆవిష్కరించిన బాబు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తెలుగు జాతి కీర్తిని తమ సినిమాలు, రచనలతో ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన బాపు, రమణల విగ్రహాలను రాజమండ్రి గోదావరి బండ్‍‌పై మంగళవారం రాత్రి ఏడు గంటలకు సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ముందుగా కుమారి టాకీస్ సమీపంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి కింద నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.

Bapu and ramana Statues at Godavari Shore

అనంతరం పీవీ నరసింహారావు పార్కుకు చేరుకుని ప్రముఖ సినీ దర్శకులు రచయిత సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు), ముళ్లపూడి వెంకటరమణల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి ప్రాముఖ్యతను సినిమా ద్వారా ప్రపంచానికి చాటిని మహనీయులు బాపూ రమణలని కొనియాడారు.

తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు తారక రామారావని ఆయన క్రమశిక్షణ, పట్టుదల వారి స్పూర్తి మనకందరికీ ఆదర్శమన్నారు. భావి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం శిల్పి వడయార్ రాజ్ కుమార్‌ను సీఎం చంద్రబాబు సత్కరించారు.

English summary
Bapu and ramana Statues at Godavari Shore unlieved by Andhra Pradesh Cheif minister Chandrabau naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X