అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల్లో తెలుగుదేశం తారక మంత్రం ఇదే!!

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడి వయసు పెరుగుతుండటం, 2029 ఎన్నికలనే టార్గెట్ గా భారతీయ జనతాపార్టీ నిర్ధేశించుకోవడం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎత్తుగడలను తట్టుకోవడం, పార్టీ నాయకులు మాట వినకపోతుండటంలాంటివన్నీ బాబుకు తీవ్ర సమస్యగా మారాయి. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో మరోసారి టీడీపీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను భుజానికెత్తుకున్నారు.

బీసీలకు రాజ్యాధికారం

బీసీలకు రాజ్యాధికారం


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు మొదటి ప్రాధాన్యం కల్పించింది. రాష్ట్ర జనాభాలో ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉండటం, రాజ్యాధికారం వారికి దూరంగా ఉండటం గమనించిన ఎన్టీఆర్ బీసీలను అక్కున చేర్చుకున్నారు. దీంతో తెలుగుదేశం బీసీల పార్టీగా మారింది. పార్టీ స్థాపన సమయంలో చేరిన బీసీ నాయకులు యువతగా ఉండేవారు. వారు ఇప్పుడు మధ్యవయస్కులయ్యారు. రెండోతరంలోకి ప్రవేశించిన తర్వాత బీసీలు దూరమవడం ప్రారంభించారు. బీసీలు పునాదిగా ఉన్న తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంవల్ల అక్కడి పట్టును కోల్పోవాల్సి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏపీకన్నా తెలంగాణలోనే టీడీపీ బలంగా ఉండేది.

అధికారంలోకి రావడంలో బీసీలదే కీలకపాత్ర

అధికారంలోకి రావడంలో బీసీలదే కీలకపాత్ర


2014లో టీడీపీ ఏపీలో అధికారంలోకి రావడంలోను బీసీలదే కీలకపాత్ర. తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో వైసీపీ టీడీపీ కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన పార్టీ అని, ఆ వర్గానికే ప్రాధాన్యతనిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. నిజం చెప్పులేసుకునేలోగా అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తుందనే సామెతను గుర్తుచేస్తూ ప్రజలందరిలో టీడీపీ కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన పార్టీ అని, వారంతా తమకన్నా సామాజికంగా ముందున్నారనే ఒకరకమైన ఆలోచనా భావనను, అసూయను ప్రశాంత్ కిషోర్ రేకెత్తించగలిగాడు. అది వైసీపీ విజయానికి ఎంతో దోహదపడింది.

బీసీ మంత్రమే తారక మంత్రం

బీసీ మంత్రమే తారక మంత్రం


బీసీలో రెండోతరానికి చెందిన యువత ఎక్కువ సంఖ్యలో పవన్ కల్యాణ్ అభిమానులుగా ఉండి వైసీపీకి ఓటు వేశారు. అధికారంలోకి రావాలంటే బీసీ మంత్రం ఒకటే తారక మంత్రమని చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో బీసీలకు సీట్లు కేటాయించబోతున్న పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు పార్టీ ఎప్పుడూ అన్యాయం చేయలేదని బాబు తన సభల్లో చెబుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు గట్టిగా ఒక పట్టు పడితే తనకు అధికారం సులువుగా దక్కుతుందని చంద్రబాబు భానవ. అందుకనుగుణంగా పార్టీ మానిఫెస్టోను రూపొందిస్తున్నారు. సీనియర్లుగా ఉన్న బీసీ నేతల నియోజకవర్గాల్లో వారి వారసులకు టికెట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకొని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంపై టీడీపీ విజయవంతమైందని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు భావిస్తున్నట్లుగా టికెట్లు బీసీలకు కేటాయించిన తర్వాత పార్టీని ఎంతవరకు విజయతీరాలకు చేరుస్తారనేది బీసీలపైనే ఆధారపడివుంది.

English summary
Telugu Desam Party has given first priority to BCs since its inception.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X