కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోస్టన్ కమిటీ రిపోర్ట్: ఆరు ప్రాంతాలుగా 13 జిల్లాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల అంచనా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Boston Consulting Group Report On AP Capital

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు విభజించింది. ఆయా జిల్లాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసి నివేదికలో పొందుపరిచింది. ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై నివేదికలో సమగ్రంగా పొందుపరిచింది. బీసీజీ నివేదికను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వివరించారు.

2.25 లక్షల కోట్ల రుణం

2.25 లక్షల కోట్ల రుణం

రాష్ట్రంలో అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై బీసీజీ అధ్యయనం చేసిందని చెప్పారు. అన్నీ ప్రాంతాలకు సమతుల్యత పాటిస్తూ, క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేసిందని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం కీలక సూచనలు చేసిందని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటికే 2.25 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఆరుప్రాంతాలుగా విభజన

ఆరుప్రాంతాలుగా విభజన

పదమూడు జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించింంది. ఉత్తరాంధ్ర జోన్‌‌గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, గోదావరి డెల్టాగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ డెల్టాగా కృష్ణ, గుంటూరు, ఈస్ట్ రాయలసీమగా కడప, చిత్తూరు. వెస్ట్ రాయలసీమగా అనంతపురం, కర్నూలు విభజించాయిన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేశారని విజయ్ కుమార్ తెలిపారు.

పర్యాటక రంగం

పర్యాటక రంగం

మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది ? ఏయే ప్రాంతాలను అభివృద్ధి చేయాలని , జనాభా, సేవల రంగం, అరకు, భీమిలి, నల్లమల అడువులు ఉన్నా పర్యాటక రంగంలో వృద్ధి ఎందుకు లేదనే అంశంపై అధ్యయనం చేసింది. ఏపీ పర్యాటక రంగంలో గ్రోత్ పాయింట్ మూడు ఉండటంపై కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. అదే కేరళలో 1.3గా ఉందని.. విదేశాల్లో 2 నుంచి 3 వరకు ఉన్నాయని గుర్తుచేసింది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమేనని ప్రస్తావించిందని విజయ్ కుమార్ చెప్పారు.

పోర్టులు

పోర్టులు

రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులపై కూడా అధ్యయనం చేసింది. ఒక్క విశాఖపట్టణం మాత్రమే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా ఉందని.. మిగతా చోట్ల లేవని పేర్కొన్నది. కృష్ణపట్నం, విశాఖ పోర్టు కూడా అభివృద్ది చెందాల్సి ఉందని అభిప్రాయపడింది. అక్షరాస్యతలో కూడా జాతీయ సగటు కన్నా తక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చేపల ఉత్పత్తిలో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలే ఫరవాలేదని.. మిగతా జిల్లాల నుంచి మత్స్య సంపద ఆశించిన స్థాయిలో లేదని చెప్పారు.

రహదారులు

రహదారులు

జాతీయ రహదారులు కూడా మారుమూల ప్రాంతాలకు అనువుగా లేదనే కఠోర సత్యం వెల్లడించారు. కుగ్రామం నుంచి నేషనల్ హైవే చేరుకోవాలంటే కనీసం 4 గంటల సమయం పడుతుందని వివరించారు. ఉత్తరాంధ్ర రీజియన్‌లో అనలిటిక్స్ డేట హబ్, మెడికల్ సర్వీస్, హెల్త్ టూరిజం, ఏకో టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది.

English summary
bcg committee divided state six places and suggest development of andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X