కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనవరి 26 తర్వాతే ఏపీ అసెంబ్లీ..? హై పవర్ కమిటీ రిపోర్ట్‌పై క్యాబినెట్‌లో చర్చ, రేపు బీసీజీ రిపోర్ట్.

|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధాని మార్పు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కమిటీల నివేదికలు కూడా అందుతున్నాయి. జీఎన్ రావు కమిటీ తన నివేదికను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి రాజధాని ప్రాంతంలో అగ్గిరాజుకుంది. మరోవైపు శుక్రవారం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు తన నివేదికను సీఎం జగన్‌ను అందజేయనుంది.

 నివేదికలో ఏముంది..?

నివేదికలో ఏముంది..?

జీసీజీ నివేదిక నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జీఎన్ రావు కమిటీ మాదిరిగా మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోందా ? లేదంటే ఇతర అంశాల గురించి తెలుపుతుందా అనే అంశం చర్చకు దారితీసింది. జీఎన్ రావు కమిటీ, శివరామకృష్ణ కమిటీ, బీసీజీ కమిటీలను హై పవర్ కమిటీ అధయనం చేస్తోంది. 10 మంది మంత్రులు, ఆరుగురు ఐఏఎస్ అధికారులతో హై పవర్ కమిటీని ఇటీవల ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. హై పవర్ కమిటీకి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.

క్యాబినెట్ భేటీ

క్యాబినెట్ భేటీ

రాజధాని మార్పునకు సంబంధించి కమిటీలు నివేదికలు అందజేస్తుంటే.. ఈ నెల 8వ తేదీన రెండో బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశమవుతోంది. సాధారణంగా జరిగే మంత్రివర్గ సమావేశమైన.. హై పవర్ కమిటీ రిపోర్ట్‌పైనే ప్రధానంగా చర్చిస్తారు. ప్రభుత్వానికి హై పవర్ కమిటీ నివేదిక అందాక కార్యాచరణను ప్రభుత్వం రూపొందించనుంది. హై పవర్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తారు. గణతంత్ర దినోత్సవం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

అఖిలపక్ష సమావేశం కూడా..

అఖిలపక్ష సమావేశం కూడా..

రాజధాని మార్పునకు సంబంధించి నివేదికలపై అసెంబ్లీలో చర్చిస్తారు. సభ్యుల అభిప్రాయం తీసుకొని.. హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని మార్పు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. అంతకుముందు అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి, అందరి అభిప్రాయాలను తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

గవర్నర్‌తో సీఎం భేటీ

గవర్నర్‌తో సీఎం భేటీ


మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వీరి భేటీ మధ్య రాజధాని మార్పు గురించి చర్చకొచ్చే అవకాశం ఉన్నది.

English summary
bcg committee will submit report to cm jagan mohan reddy on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X