అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రాజధానిపై మరో కమిటీ నివేదిక: ఆ తరువాతే తుది నిర్ణయం: మధ్యంతర నివేదికలో కీలక సూచనలు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన..జీఎన్ రావు కమిటీ సైతం అదే సూచనలతో ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ అయింది. సీఎం వ్యాఖ్యలు..జీఎన్ రావు కమిటీ సిఫార్సు ల పైన అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. దీని పైన పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన సమయంలో రెండు కమిటీలు తమ నివేదిక ఇచ్చిన తరువాత...చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామి చెప్పారు.

అందులో జీఎన్ రావు నివేదిక ఇప్పటికే అందగా..రెండో కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదక సమర్పించింది. ఈ నెల 27లోగా కమిటీ తుది నివేదిక అందిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, మరి..ఈ కమిటీ రాజధాని పైన మధ్యంతర నివేదికలో ఏం సూచనలు చేసింది..వీటిని అధ్యయనం చేసిన తరువాతనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

బీసీజీ కమిటీ నివేదిక కోసం..

బీసీజీ కమిటీ నివేదిక కోసం..

రాజధాని పైన ఇప్పటికే దాదాపు నిర్ణయం జరిగిన సమయంలో..ప్రభుత్వం నియమించిన మరో కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇదే అంశం మీద జీఎన్ రావు కమిటీతో పాటుగా బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) కు అధ్యయన బాధ్యతలు అప్పగించింది. అమెరికాలోని బోస్టన్‌ ప్రధాన కేం ద్రంగా పని చేసే బీసీజీ 1963 నుంచి ప్రపంచవ్యాప్తం గా మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీగా ప్రసిద్ధి చెం దింది. 50 దేశాల్లో 90కిపైగా కార్యాలయాలు, సు మారు 14వేల మంది ఉద్యోగులను ఈ సంస్థ కలిగి ఉంది. రాజధాని నిర్మాణంపై సవివరమైన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం బీసీజీని కోరింది. ఈ మేరకు తన అధ్యయనాన్ని చేపట్టిన బీసీజీ ఇప్పటికే కొన్ని కీలక సూచనలతో మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం.

మధ్యంతర నివేదికలో కీలక అంశాలు..

మధ్యంతర నివేదికలో కీలక అంశాలు..

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలో ప్రధానంగా అమరావతి గురించి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాజధాని వికేంద్రీకరణ జరిగితే రైతులకు కే టాయించిన రిటర్నబుల్‌ ప్లాట్ల విలువలు పడిపోకుం డా ఉండేలా చర్యల గురించి సూచించినట్లు తెలుస్తోంది. విజయవాడను రాజధాని ప్రాంతంతో అనుసంధానించేందుకు కృష్ణానదిపై వివిధ ప్రదేశాల్లో కొ త్త వంతెనలు నిర్మించాలని పేర్కొంది.

రాజ ధాని భూములకు డిమాండ్‌ పడిపోకుండా ఉంటాయని పే ర్కొన్నట్లు సమాచారం. గ్రీన్ ఫీల్డ్ రాజధాని కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని అయితే బాగుంటుందని సదురు సంస్థ సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి.. అన్ని రకాల మౌళిక వనరులు.. వసతులు ఉన్న ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ఎన్నుకుంటే అభివృద్ధి మరింత త్వరగా సాధ్యమవుతుందని.. రాజధానికి ఓ రూపు వస్తుందనేది ఆ సంస్థ తన మధ్యంతర నివేదికలో అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.

27లోగా తుది నివేదిక అందితే..

27లోగా తుది నివేదిక అందితే..

ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ను ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన జీఎన్ రావు కమిటీ నివేదిక పైన ఈ నెల 27న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ లోగా బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక సైతం అందితే.. రెండింటిపైనా కేబినెట్‌లో చర్చించి రాజధానుల వికేంద్రీకరణపై ప్ర భుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రెండో కమిటీ సైతం బ్రౌన్ ఫీల్డ్ రాజధానే బెటరని అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఈ సంస్థ కూడా రాజధాని ప్రాంతంగా విశాఖకే ఓటేసే సూచనలు కన్పిస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం అధికారిక నిర్ణయం సమయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది.

English summary
Ap Appointed second committe on capital BCG submitted interim report to govt. Mostly before 27th of this month. After that only govt may take final decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X