• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొత్తరకం కి'లేడీ'లు:వీళ్లని ఒక్కసారి 'అలా' చూశారంటే... ఆ మగాళ్ల పని అవుటే

|

మాకేం మగమహారాజులం అనుకుంటూ...సందు దొరికితే చిలక్కొట్టుడు కొట్టేద్దామని ఉవ్విళ్లూరే పురుష పుంగవులారా తస్మాత్ జాగ్రత్త...ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చి పోతే...ఆనక అయ్యే ఖర్చు తట్టుకోలేక బావురుమనాల్సి వస్తుంది...ఇంతకీ విషయమేమిటో చెప్పకుండా ఈ హెచ్చరికల మీద హెచ్చరికలు దేనికి అనుకుంటున్నారా?...అయితే ఇదే అసలు విషయం...

అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం కొందరు కిలాడీ లేడీలు విసురుతున్న వలపు వలల గురించి తెలిస్తే...అందుకు వారు అనుసరిస్తున్న పద్దతుల గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే అయ్య బాబోయ్ అనుకోవడం ఖాయం...మగాళ్లని ఆకట్టుకోవడంలో...ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్...మొత్తంగా పరాయి పురుషుడిని పడేయడమే వాళ్ల టార్గెట్..పడేశాక...అవసరమైతే శృంగార సామ్రాజ్యంలో ఓలలాడించాక...ఆ తరువాత...అప్పుడు మొదలవుతుంది అసలు కథ...అప్పటిదాకా మదమెక్కి మృగాళ్ల లాగా రెచ్చిపోయిన ఆ మగాళ్లు బావురుమనే వాస్తవ గాథ...పైగా ఈ కధలూ...గాధలన్నీ రాజధాని ప్రాంతంలోనివి కావడం కొసమెరుపు...

మోహపు చూపులే...వాళ్లకు పెట్టుబడి...

మోహపు చూపులే...వాళ్లకు పెట్టుబడి...

పరాయి స్త్రీ పట్ల కొందరు పురుష పుంగవులకి ఉండే వ్యామోహం...కొంతమంది మాయాలేడీలకు కాసుల వర్షం కురిపించే తిరుగులేని వరంగా పరిణమిస్తోంది. అందుకు ఈ కిలేడీలు అనుసరిస్తున్న విధానాల్లో ఎవరి శైలి వారిది...అయితే ఈ నెరజాణల వలపు వలల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నకొందరు మగానుభావుల అనుభవాలను తెలుసుకుంటే మిగిలినవాళ్లయినా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది...

స్క్రీన్ ప్లే వేరయినా...స్టోరీ ఒక్కటే

స్క్రీన్ ప్లే వేరయినా...స్టోరీ ఒక్కటే

సరే పద్దతి వేరైనా ఈ వింత విషాద కథలన్నింటిలో ఆరంభం ముగింపు మాత్రం ఒక్కలాగానే ఉంటున్నాయి...మొదట కాస్త డబ్బులున్నమగాళ్లని ఎంచుకోవడంవారి...ఫోన్‌ నంబర్‌ సంపాదించడం...వలపు వల విసరడం...ఆ తరువాత శృంగారం నెరుపుతూ కెమెరాల్లో రికార్డు చేసుకోవడం...ఆ తరువాత ఫోన్ చేసి బెదిరించడం...తామున్న చోటికే ఆ మగాళ్లు వెతుక్కుంటూ వచ్చి...సొమ్ములు సమర్పించుకొని...దండం పెట్టి మరీ వెళ్లిపోవడం...ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు గుంటూరు నగరం పరిధిలో ఎక్కువగా వెలుగు చూడటం ఒక విశేషమైతే...అందులో ఫిర్యాదు వరకు వెళ్లింది అతి తక్కువ కావడం మరో విశేషం.

రొమాంటిక్ ఛీటింగ్ స్టోరీ...ఆర్టిస్టులు,లొకేషన్లు మారినా...కథ అదే...

రొమాంటిక్ ఛీటింగ్ స్టోరీ...ఆర్టిస్టులు,లొకేషన్లు మారినా...కథ అదే...

ఒక కాల్ గర్ల్...మరో మోసగాడు...ఇద్దరు భార్యాభర్తాల్లాగా ఒక అపార్ట్ మెంట్ లో దిగుతారు. ఆ తరువాత ఆ ఆదర్శ గృహిణీ ఆ అపార్ట్ మెంట్ లోని వాళ్లందరితో అత్యంత చురుకుగా స్నేహ బంధాలు అల్లేస్తుంది... ఆ తరువాత మాటల మధ్యలో తన మొగుడికి మగతనం లేదని...అయినా ఎంతో ఓర్పుతో సహనంతో గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తున్నానని వాపోతుంది...అంతే ఆ విషయం...ఆ నోటా ఈ నోటా అపార్ట్ మెంట్ అంతా పాకేస్తుంది...ఆ తరువాత ఆడవాళ్లేమో...సానుభూతితో ...మగవాళ్లేమో అదోరకంగా చూడటం మొదలుపెడతారు. అందులో మోహపు చూపులు బాగా విసురుతున్నధనికులను మాత్రమే వీరు టార్గెట్ చేసుకుంటారు. ఆ మగాళ్లు ఒకరికి తెలియకుండా ఒకరు తనను ఏకాంతంలో ఓదార్చే అవకాశాన్ని ఆ భార్య కల్పిస్తుంది..అందుకు ఆ భర్త సహకరిస్తాడు...ఆ తరువాత...

ఆ తరువాత...వసూళ్లు ఇలా...

ఆ తరువాత...వసూళ్లు ఇలా...

ఆ పురుష పుంగవుడు...మాయాలేడీని ఏకాంతంగా ఓదార్చుతుండగా ఆ ఇంట్లో ముందే అమర్చి ఉన్న సీక్రెట్ కెమేరాలో మొత్తం రికార్డు చేస్తారు...ఆ తరువాత ఆ సానుభూతి వీరుడికి ఆ అమాయక గృహిణి నుంచి ఫోనొస్తుంది. మాది చాలా పరువు గల సాంప్రదాయ కుటుంబం. మన ఏకాంత దృశ్యాలు మా ఆయన కెమేరాలో రికార్డు చేశాడు...నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు...పోలీస్‌ కంప్లయింట్ ఇద్దామంటే మీ పరువు గుర్తొచ్చి ఆగిపోతున్నాను...ఎందుకంటే నాకు నా పరువు కన్నా మీ పరువే ముఖ్యం...అని విలపిస్తుంది...మరెలా...ఏమి చెయ్యాలంటే...మా ఆయనకు ఈ మధ్య ఏదో డబ్బు సమస్య వచ్చింది.. అందుకే ఇంత హింసాత్మకంగా తయారయ్యాడని...అది సర్దితే ఈ వివాదం సద్దుమణగొచ్చని సలహా ఇస్తుంది...అంతే డబ్బు చేతులు మారుతుంది...సమస్య సద్దు ముణుగుతుంది...ఇలా ఒకే అపార్ట్ మెంట్లో చాలామంది డబ్బు సమర్పించుకుంటూ ఉంటారు...ఇలా సాగినంతకాలం...ఆ తరువాత...అక్కడ్నుంచి మకాం మార్చేస్తారు..వీళ్ల బారినపడి క్యాష్ వదిలించుకున్న మగాళ్లంతా బతుకు జీవుడా అనుకుంటారు.

అయితే ఒక మాయాలేడి మాత్రం...చుక్కలు చూపించింది...

అయితే ఒక మాయాలేడి మాత్రం...చుక్కలు చూపించింది...

గుంటూరు నగరం నడిబొడ్డున ఉండే ఒక పేటలోని ఓ అపార్టుమెంట్‌లో మాత్రం ఇలాంటి కిలేడీ అందులోని మగవాళ్లకు చుక్కలు చూపించింది. ఆమె వలపు వలలో అపార్ట్ మెంట్ లోని ఏడుగురు వ్యక్తులు చిక్కుకోగా...ఆమె ఏకంగా తన భర్త చిత్రహింసలు భరించలేక చచ్చిపోతున్నానంటూ ఫినాయిల్ తాగి నాటకాన్ని రక్తి కట్టించింది...ఆ తర్వాత చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరింది...అంతే ఈ విషయం తెలిసిన...ఆమెతో లింకున్న అపార్ట్ మెంట్ అంకుల్స్ ఆమె కేమైనా సీరియస్ అయితే తమ పేరెక్కడ బైటపడుతుందో...అసలు ఇప్పుడేమి జరుగుతుందో అనుకుంటూ ఒకరికి తెలియకుండా మరొకరు ఆస్పత్రి బైట కాపలాలు కాశారట...ఆ తరువాత ఒకర్నిఒకరు అక్కడ చూసుకొని..ఆ తరువాత అసలు విషయం అర్థమైనా చేసేదేమీ లేక...అందరూ కలసి డబ్బు పోగేసి...ఓ మీడియేటర్ ద్వారా
ఆ డబ్బు ముట్ట చెప్పి దండం పెట్టి పారిపోయారట...ఆ తరువాత ఆమె అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోయింది.

మరో రకం...బెదిరింపులు..

మరో రకం...బెదిరింపులు..

గుంటూరు నగరం శివారులో ఉండే ఒక కాలనీకి చెందిన వ్యాపారి నగరానికి మరోవైపు శివారున ఉన్న అపార్టుమెంట్‌లో నివాసం ఉండే మహిళ సెక్స్‌ వర్కర్‌ అని తెలిసి ఆమె వద్దకు వెళ్లాడు. అయితే మూడు రోజుల తరువాత ఆ వ్యాపారికి ఆ సెక్స్ వర్కర్ నుంచి ఫోనొచ్చింది...మీరు నాదగ్గరకు రావడం, వెళ్లడం మా ఆయన చేశాడని...నేను ఇలా చేస్తానని మా ఆయనకు తెలియదని...అందుకే మీపై కోపంతో మీ మీద అట్రాసిటీ కేసు పెడతానని అంటున్నాడని చెప్పింది. దీంతో ఆ వ్యాపారి తనపై కేసు పెట్టొద్దని వేడుకోగా అయితే లక్ష రూపాయల కోసం డిమాండ్ చేశారు. చివరకు ఆ వ్యాపారి తన ముచ్చట ఫలితానికి 50 వేలు చెల్లించి బైటపడినట్లు తెలిసింది.

ట్విస్ట్ ఏంటంటే...అతడు భర్తే కాదు...

ట్విస్ట్ ఏంటంటే...అతడు భర్తే కాదు...

అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే మా అయన కేసు పెడతాడంటూ వ్యాపారిని బెదిరించిన ఆ సెక్స్ వర్కర్ కు భర్తలా నటిస్తుంది ఓ చిల్లర దొంగ అంట. అతడు ఒక దొంగతనం కేసులో పట్టుబడగా ఆ క్రమంలో పోలీసులు అతడు నివాసం ఉండే అపార్ట్ మెంట్ ను తనిఖీ చేస్తే ఆ సెక్స్ వర్కర్ తో సన్నిహితంగా గడిపిన 30 మంది వ్యక్తుల శృంగార కార్యకలాపాలన్నీ రికార్డైన సీడీలు, పెన్ డ్రైవ్ లు దొరికాయంట...ఇంతకూ అసలు విషయమేమిటంటే... ఆ చిల్లర దొంగ, సెక్స్ వర్కర్ తెనాలిలో అనుకోకుండా పరిచయమై సులభ సంపాదన కోసం ఈ ప్లాన్ వేశారంట...ఆ క్రమంలో ఇలా ఇప్పటివరకు ఎంతమంది దగ్గర ఎంత వసూలు చేశారో తెలియదు కానీ హైదరాబాద్ కు చెందిన ఒక్క వ్యాపారి నుంచే రూ.9 లక్షలు వసూలు చేశారంటే ఎంతటి కేటుగాళ్లో అర్థం చేసుకోవచ్చు.

ఇంకో రకం కథ...మగాళ్ల విల విల...

ఇంకో రకం కథ...మగాళ్ల విల విల...

ఇటీవల గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్ఐవి వ్యాధి నిర్ధారణ పరీక్ష్ా కేందం వద్దకు ఒక మహిళ వచ్చిందట... తనకు ఎయిడ్స్ వచ్చిందని డౌట్ గా ఉందని టెస్ట్ చెయ్యమని బ్లడ్ శాంపిల్ ఇచ్చిందట...ఆ తరువాత అక్కడే ఓ పక్కకు వెళ్లి ఏడుస్తూ ఓ వ్యక్తితో గొడవ పడుతోందట. నాకు ఎయిడ్స్‌ వచ్చిందని తేలింది...నాకు నీతో తప్ప ఇంకెవరితో శారీరక సంబంధం లేదు...నీ వల్లే నాకు ఎయిడ్స్ వచ్చింది...ఇప్పుడు నా జీవితం ఏమైపోవాలి...నేనెలా బతకాలి అని ఏడుస్తందట...అంతే కొద్ది సేపటికే ఒక వ్యక్తి వచ్చి బైటకు తీసుకెళ్లాడట...ఇదంతా వింటున్న సెక్యూరిటీ గార్డ్ అయ్యో పాపం అనుకున్నాడట...అయితే అదే మహిళ తరువాత రోజు కూడా అలాగే ఏడుస్తూ గొడవ పడటం...ఈసారి మరో వ్యక్తి వచ్చి బైటకు తీసుకెళ్లడం చూసి అయ్య బాబోయ్ అనుకున్నాడట...

ఇలాంటివే మరికొన్ని కథలు..జాగ్రత్తలు...

ఇలాంటివే మరికొన్ని కథలు..జాగ్రత్తలు...

నగరంలోని మరో కాలనీలో ఇటీవలే చోటు చేసుకున్నఘటన ఇది...ఇందులో పాత్రధారులు కాలేజీ స్టూడెంట్స్ అయిన అమ్మాయిలు...వీరి బారిన పడింది కూడా హై క్లాస్ హయ్యర్ స్టడీస్ అబ్బాయిలే...ఆ అమ్మాయిలు ఈ కుర్రాళ్లతో సరససల్లాపాలన్నింటిని రికార్డ్ చేసి బెదిరిస్తుండటంతో అబ్బాయిల తల్లిదండ్రులే రంగంలోకి దిగి అమ్మాయిలు అడిగినంతా సమర్పించుకొని తమ సుపుత్రుల ఘనకార్యాల వీడియోలు తీసుకొని వెళ్లిపోయారట...ఈ విషయం పోలీసుల దాకా వచ్చినా ఎవరూ ఫిర్యాదు చెయ్యకపోవడంతో పోలీసులు కూడా చేసేదేం లేక సైలెంట్ అయిపోయారట. అలాగే గతంలో పెదకాకానిలో ఇలాగే ఓ అపార్టుమెంట్‌లోని సెక్స్ వర్కర్ల దగ్గరకు వచ్చే మగాళ్ల శృంగార కార్యకలాపాలు వీడియోలు రికార్డ్ చేసి...ఆ తరువాత బెదిరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో...పోలీసుల ద్వారా ఈ వ్యవహారాలు వెలుగు చూసి ఆ తరువాత ఇలాంటి ఘటనలే తమకు తెలిసినవి చెప్పుకోవడం ద్వారా ఇదో వ్యాపారం గా వర్థిల్లుతోందని అర్థమై పోలీసులు తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తున్నారు.

English summary
Guntur: It is surprising that some women using sex as a weapon for earn money in the capital region. Some romantic cheating methods being used by those women are surprised to police too.These are some of those cases...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X