హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బియాస్ ట్రాజెడీ: సిటీకి నిఖిల్ మృతదేహం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థి నిఖిల్ మృతదేహాన్ని సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నిఖిల్ వరంగల్ జిల్లాలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతుల కుమారుడు. నిఖిల్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

కాగా, రెండు వారాల క్రితం బియాస్ నదిలో హైదరాబాద్‌కు చెందిన 24మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతవగా తాజాగా దొరికిన నిఖిల్, పరమేశ్వర్, రుత్విక్‌ల మృతదేహాలతో ఇప్పటి దాకా 17 మృతదేహాలు లభ్యమైనట్లయింది. మిగితా ఏడుగురు విద్యార్థులు, ఒక ఫ్యాకల్టీ సభ్యుడి కోసం గజ ఈతగాళ్లు, భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

బియాస్ విషాదం

బియాస్ విషాదం

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థి నిఖిల్ మృతదేహాన్ని సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

బియాస్ విషాదం

బియాస్ విషాదం

నిఖిల్ వరంగల్ జిల్లాలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతుల కుమారుడు. నిఖిల్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించారు.

బియాస్ విషాదం

బియాస్ విషాదం

వరంగల్ జిల్లాలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి నిఖిల్ మృతదేహాన్ని తీసుకువస్తున్న దృశ్యం.

బియాస్ విషాదం

బియాస్ విషాదం

నిఖిల్ మృతి పట్ల అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఇతర నాయకులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

బియాస్ విషాదం

బియాస్ విషాదం

రెండు వారాల క్రితం బియాస్ నదిలో హైదరాబాద్‌కు చెందిన 24మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతవగా తాజాగా దొరికిన నిఖిల్, పరమేశ్వర్, రుత్విక్‌ల మృతదేహాలతో ఇప్పటి దాకా 17 మృతదేహాలు లభ్యమైనట్లయింది.

బియాస్ విషాదం

బియాస్ విషాదం

నిఖిల్ మృతిని తట్టుకోలేని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా కన్నీటి పర్యాంతమయ్యారు.

నిఖిల్(ఫైల్)

నిఖిల్(ఫైల్)

విహారయాత్రకు వెళ్లి బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి నిఖిల్.

English summary
Two weeks after the tragedy in Beas river, bodies of four victims, Nikhil, B. Ritwik Rao, M. Kiran Kumar, and Ch. Parameswar were brought to Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X