హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాజెడీ: సాయిరాజ్ ఫ్యామిలీ కన్నీరుమున్నీరు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బియాస్ దుర్ఘటనలో మృతి చెందిన మహెన్ సాయిరాజ్ అంత్యక్రియలు శనివారం జరిగాయి. శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక వాహనంలో ప్రగతి నగర్‌లోని పంచవటి అపార్టుమెంటుకు మృతదేహాన్ని మధ్యాహ్నం తీసుకు వచ్చారు.

సాయిరాజ్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అనంతరం చెరువు సమీపంలోని శ్మశానవాటికలో ప్రగతి నగర్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అధికారికంగా సాయిరాజ్ అంతిమ సంస్కారాలు జరిగాయి. తండ్రి సుబ్బారావు చితికి నిప్పంటించారు.

సాయిరాజ్‌కు తుది వీడ్కోలు పలకడానికి బంధువులతో పాటు సహచర విద్యార్థులు, గ్రామస్థులు తరలి వచ్చారు. కాగా, బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

సాయిరాజ్

సాయిరాజ్

సింగపూర్ వెళ్లి స్థిరపడతాడనుకున్న కుమారుడు కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన సాయిరాజ్ మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం ప్రగతినగర్‌లోని పంచవతి అపార్ట్‌మెంట్‌లోని ఇంటికి తీసుకొచ్చారు.

సాయిరాజ్

సాయిరాజ్

విజ్ఞాన యాత్రకు హుషారుగా వెళ్లిన కొడుకు శవపేటికలో తిరిగి రావడం చూసిన తల్లిదండ్రులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

సాయిరాజ్

సాయిరాజ్

సాయిరాజ్ గల్లంతైన నాటి నుంచి గదికే పరిమితమైన తల్లి ఆశాకు కుమారుడిని కడసారి చూసేందుకు నిముషాల సమయమే దక్కింది.

 సాయిరాజ్

సాయిరాజ్

13 రోజులపాటు నీటిలో ఉన్న సాయిరాజ్ మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారడంతో నది వద్ద నుంచి ప్రత్యే కంగా తయారు చేయించిన పెట్టెలో తీసుకురావడంతో పార్థీవదేహాన్ని తాకడానికి కూడ వీలులేకుండా పోయింది.

సాయిరాజ్

సాయిరాజ్

దీంతో ఇంటి వద్ద ఐదు నిముషాలే ఉంచారు. అనంతరం అం బులెన్స్‌లో ప్రగతినగర్ శ్మశానవాటికకు తీసుకొచ్చారు. సాయిరాజ్ తండ్రి సుబ్బారావు హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు.

సాయిరాజ్

సాయిరాజ్

స్నేహితుడ్ని కడసారి చూసేందుకు కళాశాల తోటి విద్యార్థులు హాజరై కన్నీరుమున్నీరయ్యారు. సాయిరాజ్ అంత్యక్రియల్లో కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కృష్ణ, గ్రామపంచాయతీ సర్పంచ్ శాంతకుమారి, మాజీ సర్పంచులు దయాకర్‌రెడ్డి, శ్రీరాములు, లక్ష్మికుమారి, సుధీర్‌రెడ్డి, కేపీహెచ్‌బి పోలీసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 సాయిరాజ్

సాయిరాజ్

ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని సాయిరాజ్ సింగపూర్‌లో ఉన్న మామ వద్దకు వెళ్లి ఎమ్మెస్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడదామని అనుకున్నాడని బంధువులు తెలిపారు.

 సాయిరాజ్

సాయిరాజ్

బియాస్ దుర్ఘటనలో మృతి చెందిన మహెన్ సాయిరాజ్ అంత్యక్రియలు శనివారం జరిగాయి. శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక వాహనంలో ప్రగతి నగర్‌లోని పంచవటి అపార్టుమెంటుకు మృతదేహాన్ని మధ్యాహ్నం తీసుకు వచ్చారు.

 సాయిరాజ్

సాయిరాజ్

సాయిరాజ్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అనంతరం చెరువు సమీపంలోని శ్మశానవాటికలో ప్రగతి నగర్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అధికారికంగా సాయిరాజ్ అంతిమ సంస్కారాలు జరిగాయి. తండ్రి సుబ్బారావు చితికి నిప్పంటించారు.

 సాయిరాజ్

సాయిరాజ్

సాయిరాజ్‌కు తుది వీడ్కోలు పలకడానికి బంధువులతో పాటు సహచర విద్యార్థులు, గ్రామస్థులు తరలి వచ్చారు. కాగా, బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

English summary
Beas tragedy: Sairaj body to Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X