కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిప్యూటీ సీఎంను అయ్యానంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్షే:కేఈ కృష్ణమూర్తి

|
Google Oneindia TeluguNews

కర్నూలు:తాను టీడీపీలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నానంటే ఎన్టీఆర్‌ పెట్టిన భిక్షేనని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు.కర్నూలు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో దీక్ష చేస్తానన్న పవన్‌కళ్యాణ్‌ మరి ఎందుకు దీక్షఎందుకు చేయడం లేదో సమాధానం చెప్పాలని కేఈ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల నడ్డి విరిచారని కెఈ మండిపడ్డారు. నవ్యాంధ్రలో రెవెన్యూ సంస్కరణలు అమలు పరిచి వాటిని వేగవంతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి మహోన్నతమైమదని కెఇ.కృష్ణమూర్తి కొనియాడారు.

రెవిన్యూ శాఖ...నూతన సంస్కరణలు

రెవిన్యూ శాఖ...నూతన సంస్కరణలు

అంతకుముందు మంగళవారం నంద్యాలలో రూ.2.25 కోట్లతో నూతనంగా నిర్మించే సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన సందర్బంగా డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సారథ్యంలో రెవెన్యూ విభాగంలో దాదాపు 40 కొత్త సంస్కరణలు అమలు చేశామని చెప్పారు.

అలా...సమస్యల పరిష్కారం

అలా...సమస్యల పరిష్కారం

అలాగే సర్వే విభాగంలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ...ఆ కొరతను నివారించేందుకు వెలుగు సిబ్బంది ద్వారా సర్వే సమస్యలను పరిష్కరించామని కెఈ చెప్పుకొచ్చారు. అలాగేచుక్కల భూమి సమస్యలు పరిష్కరించడంలోనూ జాయింట్ కలెక్టర్ ల ఆధ్వర్యంలో అనేక మీటింగులు ఏర్పాటు చేసి దాదాపుగా వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు.

సిఎం డ్యాష్ బోర్డుతో...అవీ పరిష్కరిస్తాం

సిఎం డ్యాష్ బోర్డుతో...అవీ పరిష్కరిస్తాం

ఆటోమోషన్‌, మీభూమి పోర్టుల ద్వారా రెవెన్యూ విభాగంలో భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించే దిశలో ఉన్నామని కెఈ ఈ సందర్భంగా వివరించారు. ఈ సమస్యలను సిఎం డ్యాష్‌ బోర్డు ద్వారా పరిష్కరించనున్నామని కెఈ వెల్లడించారు.

 ఎపి...ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

ఎపి...ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

రాష్ట్రంలో తీసుకునే రెవెన్యూ సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని కెఈ కృష్ణమూర్తి చెప్పారు. ఇంకా పట్టణ, నగర ప్రాంతాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో 9 అర్బన్‌ మండలాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విఆర్‌ఎల జీతభత్యాల పెంపు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి గెలిపించాలని కెఈ కోరారు.

English summary
Kurnool:Deputy Chief Minister KE Krishna Murthy said that he has been a deputy chief minister now and six times became MLA only because of NTR's alms. Speaking to the media in Kurnool, he made these comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X