వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు తరపున ప్రతినిధులుగా ఆ ఇద్దరు

|
Google Oneindia TeluguNews

ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా టీడీపీ ప్రతినిధి బృందం హాజరుకానుంది.ఈ మేరకు టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ బృందం లేఖను కూడ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

టెక్నాలజీ కొంప ముంచిందా? నేల విడిచి సాము చేశామా ?ఆత్మ విమర్శ అవసరం అన్న టీడీపీ నేతటెక్నాలజీ కొంప ముంచిందా? నేల విడిచి సాము చేశామా ?ఆత్మ విమర్శ అవసరం అన్న టీడీపీ నేత

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణం చేయనున్న సందర్భంగా హాజరు కావాలా వద్దా అన్న అంశంపై టీడీపీ శాసనసభపక్ష సమావేశంలో చర్చ జరిగింది.ఈ సమావేశంలో జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయం తీసుకొన్నారు. జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే చంద్రబాబు తరపున ప్రతినిధులుగా టీడీపీ సీనియర్ నాయకులు ఎనమల రామకృష్ణుడు , అచ్చెన్నాయుడు హాజరు అవుతారని తెలుస్తుంది.

Behalf of Chandrababu these two TDP representatives are attending Jagans swearing in cermenoy.

గతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గానీ, అమరావతి శంకుస్థాపనకు కానీ జగన్ రాలేదు .2014లో తాను సీఎంగా చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరేందుకు ప్రయత్నించగా జగన్ అందుబాటులో లేరు . జగన్ హాజరుకాలేకపోయినా కనీసం వైసీపీ ప్రతినిధి బృందాన్ని సైతం పంపలేదు. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కూడా హాజరు కావాలని మంత్రుల బృందం వైయస్ జగన్ నివాసమైన లోటస్ పాండ్ కు వెళ్ళింది . మంత్రుల బృందాన్ని కలిసేందుకు జగన్ నిరాకరించారు. గత పరిణామాలను గుర్తుకు తెచ్చిన టీడీపీ శ్రేణులు జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు దూరంగా వుండాలని, టీడీపీ తరపున ఎనమల రామకృష్ణుడు , అచ్చెన్నాయుడు వెళ్ళాలని నిర్ణయించారు .

English summary
Jagan did not come to Chandra Babu's swearing-in , Jagan was not available when he tried to appeal to the swearing-in ceremony. Even if Jagan does not attend, at least the YCP Representative team has not been sent. In the case of capital ramifications also Jagan did not attend So now Chandrababu or TDP leaders decided not to go for swearing Jagan as chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X