కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తేల్చలేకపోయారా: బుట్టా రేణుక కౌంటర్లు, ట్విస్ట్.. బాబుకూ ఝలక్ ఇచ్చారు

కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసిపిని వీడిన నేతలు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసిపిని వీడిన నేతలు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు.

ఆగండి! పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలుఆగండి! పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ తర్వాత కూడా వైసిపి పైన, పార్టీ అధినేత పైన నిప్పులు చెరుగుతున్నారు. మంత్రులు అఖిలప్రియ, సుజనా చౌదరి, అమర్నాథ్ రెడ్డిల నుంచి ఎమ్మెల్యేలు, నేతల వరకు జగన్‌ను టార్గెట్ చేశారు.

బాబు సమక్షంలో టిడిపిలోకి బుట్టా రేణుక కానీ ట్విస్ట్: జగన్‌ను దెబ్బతీసేందుకేబాబు సమక్షంలో టిడిపిలోకి బుట్టా రేణుక కానీ ట్విస్ట్: జగన్‌ను దెబ్బతీసేందుకే

 మెత్తగా మాట్లాడినా, తీవ్ర వ్యాఖ్యలే

మెత్తగా మాట్లాడినా, తీవ్ర వ్యాఖ్యలే

పార్టీ వీడిన సమయంలో, ఆ తర్వాత జగన్ పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఎంపీ బుట్టా రేణుక కూడా కాస్త మెతగ్గా మాట్లాడినప్పటికీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు సమక్షంలో తన అనుచరులను టిడిపిలో చేర్పించినప్పుడు, ఆ తర్వాత టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలలో ఓ విధంగా ఘాటుగానే మాట్లాడారు.

జగన్ పైన ఘాటుగా

జగన్ పైన ఘాటుగా

సోమవారం రాత్రి తనను సస్పెండ్ చేయడంపై ఆమె స్పందించారు. తనను వైసిపి నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదన్నారు. తన భర్త వైసిపితో కొంత విబేధించినా తాను మాత్రం మనస్ఫూర్తిగా పార్టీ కోసం పని చేశానని చెప్పారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో విశ్లేషించేంత అనుభవం తనకు లేదని జగన్‌ను ఉద్దేశించి తీవ్రంగానే స్పందించారు.

సస్పెండ్ చేసినందు వల్లే టిడిపికి మద్దతు, రేణుక ట్విస్ట్

సస్పెండ్ చేసినందు వల్లే టిడిపికి మద్దతు, రేణుక ట్విస్ట్

తమను టిడిపి నుంచి సస్పెండ్ చేశారని, అందుకే తాము టిడిపికి మద్దతు తెలుపుతున్నామని బుట్టా రేణుక అభిప్రాయపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం సాగిందని, ఆ తర్వాత తనను సస్పెండ్ చేశారని, దీంతో ఆ ప్రచారంపై స్పష్టత ఇచ్చేందుకు చంద్రబాబును కలిసి మద్దతు తెలిపానని చెప్పారు.

 అసంతృప్తిని జగన్ పట్టించుకోనందువల్లే

అసంతృప్తిని జగన్ పట్టించుకోనందువల్లే

గత నెలరెండు నెలలుగా వైసిపిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం వైసిపి అధిష్టానం చేయలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తద్వారా టిక్కెట్, ఆర్థికంగా ఆదుకోవడంలో తనకు హామీ ఇవ్వకపోవడమే పార్టీ మారడానికి కారణాలు అని ఆమె అభిప్రాయపడ్డారు. బుట్టా రేణుకను స్వయంగా జగన్ బుజ్జగించినా కొన్ని అంశాలపై హామీ ఇవ్వకపోవడం వల్లే ఆమె టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు.

 చంద్రబాబుకే వదిలేసిన బుట్టా రేణుక

చంద్రబాబుకే వదిలేసిన బుట్టా రేణుక

టిడిపిలో తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయమై బుట్టా రేణుక స్పందించారు. రాజకీయ భవిష్యత్తును చంద్రబాబుకే వదిలేసినట్లు చెప్పారు. ఆమె మరో మాట కూడా చెప్పారు. 2019లో కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నారు. ఈ మాటల్లోనే ఆమెకు చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ లభించినట్లుగా అర్థమవుతోంది.

 బాబుకు షాకింగ్ తప్పదా

బాబుకు షాకింగ్ తప్పదా

కేవలం తన అనుచరులను మాత్రమే టిడిపిలో చేర్పించిన బుట్టా రేణుక.. జగన్ పాదయాత్ర సమయంలో టిడిపిలో చేరి వైసిపిని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. అయితే, ఆమె మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. 2019లో ప్రభుత్వ అభివృద్ధి పనులను పూర్తిగా చూశాక టిడిపిలో చేరాలా వద్దా అనే విషమయై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తద్వారా ఆమె టిడిపికి కూడా షాకిచ్చారని చెప్పవచ్చు. దీంతో ఆమె వైసిపిలో ఎప్పుడు చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.

English summary
In a major setback to YSR Congress, its senior leader MP Butta Renuka from Rayalseema region of Andhra Pradesh is joined the Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X