వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యుత్సాహమే కానీ: లోకేష్ '200 నియోజకవర్గాల' తడబాటు వెనుక..

తెలుగుదేశం పార్టీ యువ నేత, మంత్రి నారా లోకేష్ ఇటీవల తడబాటుతో వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం అనంతపురంలో చేసిన ప్రసంగంపై ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేసింది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ యువ నేత, మంత్రి నారా లోకేష్ ఇటీవల తడబాటుతో వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం అనంతపురంలో చేసిన ప్రసంగంపై ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేసింది. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

అయితే, నారా లోకేష్ చెప్పింది తరిచి చూస్తే... అలాగే ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే.. ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదని తెలుస్తోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

<strong>బాబుపై అసంతృప్తి: టిడిపికి ఆనం వివేకా గుడ్‌బై, రంగంలోకి వైయస్ జగన్?</strong>బాబుపై అసంతృప్తి: టిడిపికి ఆనం వివేకా గుడ్‌బై, రంగంలోకి వైయస్ జగన్?

ఆ రోజు నారా లోకేష్ మాట్లాడుతూ... 225 స్థానాలకు గాను 200 స్థానాలలో టిడిపిని గెలిపించాలని వ్యాఖ్యానించారు.

ఇదీ నారా లోకేష్ లెక్క!

ఇదీ నారా లోకేష్ లెక్క!

ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. కానీ లోకేష్ మాత్రం 225 స్థానాలకు గాను 200 సీట్లలో గెలిపించాలన్నారు.

నారా లోకేష్ వ్యాఖ్యల్లో అత్యుత్సాహం ఉంది కానీ, పొరపాటు మాత్రం కాదని అంటున్నారు.

నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ

నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ

ఎందుకంటే, ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేసి, వాటిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

నియోజకవర్గాలు పెరుగుతాయి

నియోజకవర్గాలు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్ వవ్యవస్థీకరణ జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225కు పెరుగుతాయి. దీనిపై చంద్రబాబు, కేసీఆర్‌లకు కేంద్రంలోని బీజేపీ హామీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది.

పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని...

పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని...

ఈ నేపథ్యంలోనే.. నియోజకవర్గాల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని 175 నియోజకవర్గాలకు బదులు 225 నియోజకవర్గాల్లో 200 స్థానాల్లో గెలిపించాలని వ్యాఖ్యానించారని చెబుతున్నారు.

English summary
Behind TDP leader and Minister Nara Lokesh 200 constituencies comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X