చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికె బాబుకు వైసిపి షాక్ వెనుక: లావణ్య దూకుడు మిస్‌ఫైర్, పెద్దిరెడ్డి చక్రం

చిత్తూరు జిల్లా కీలక నేత సికె బాబు దంపతులకు వైసిపి ఇటీవల షాకిచ్చింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సికె బాబుకు వైసిపితో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా కీలక నేత సికె బాబు దంపతులకు వైసిపి ఇటీవల షాకిచ్చింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సికె బాబుకు వైసిపితో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది.

చదవండి: మీరేంటో అర్థంకావట్లేదు, అడగరా?: బాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, బిజెపి బలపడాలంటే..

అంతకుముందు సికె బాబు సతీమణి సికె లావణ్య పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జంగాలపల్లి శ్రీనివాస రావు పైన చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. దీంతో వారికి పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. దీంతో వారి వర్గంలో ఆందోళన ఏర్పడింది.

చదవండి: 'విదేశాల నుంచి వచ్చాక జగన్ ఏదో ఒకటి చేయాలిగా, జేసీ చెప్పినట్లు చేస్తాం'చదవండి: 'విదేశాల నుంచి వచ్చాక జగన్ ఏదో ఒకటి చేయాలిగా, జేసీ చెప్పినట్లు చేస్తాం'

వైసిపికి కోపం తెప్పించిన సికె లావణ్య వ్యాఖ్యలు

వైసిపికి కోపం తెప్పించిన సికె లావణ్య వ్యాఖ్యలు

సికె లావణ్య నియోజకవర్గ ఇంచార్జ్, ఇతర నేతలపై మండిపడ్డారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ సికె బాబుకే ఇస్తారని, దేవుడు దయతలిస్తే ఆయన మంత్రి కూడా అవుతారని వ్యాఖ్యానించారు. వైయస్‌కు, సికె బాబుకు ముప్పై ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అంటూ కొందరిపై మండిపడ్డారు.

షాకిచ్చిన వైసిపి, పెద్దిరెడ్డి చక్రం తిప్పారా?

షాకిచ్చిన వైసిపి, పెద్దిరెడ్డి చక్రం తిప్పారా?

దీంతో వైసిపి.. సికె బాబుకు షాకిచ్చింది. వైసిపితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. నియోజకవర్గ ఇంచార్జ్ జంగాలపల్లి శ్రీనివాస రావు.. వైసిపి కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అనుచరుడు. ఈ కారణంగా పెద్దిరెడ్డి చక్రం తిప్పి.. సికె బాబుకు పార్టీతో సంబంధం లేదని పార్టీ నుంచి ప్రకటన ఇప్పించారనే ప్రచారం సాగుతోంది. ఆయనకు అసలు పార్టీలో సభ్యత్వమే లేదని తేల్చి చెప్పారు.

ఇదీ రాజకీయ ప్రస్థానం

ఇదీ రాజకీయ ప్రస్థానం

సీకె బాబు మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యేగా పని చేశారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలోను కాంగ్రెస్ అభ్యర్థిగా సికె బాబు గెలిచారు. 1989లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2003లో ఓ కేసులో ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 2009లో తిరిగి టిక్కెట్ దక్కించుకొని గెలిచారు. కాంగ్రెస్‌లో వైయస్ వర్గీయుడిగా ఉన్నారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరం

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరం

సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడారు. అప్పటికే కాపు సామాజిక వర్గం నేత జంగాలపల్లికి వైసిపిలో కీలక నేత అయ్యారు. ఆ తర్వాత సికె బాబు వైసిపిలో చేరారు. కానీ జంగాలపల్లికి 2014లో టిక్కెట్ ఇస్తామని, మీకు ఇవ్వమని అప్పుడే సికె బాబుకు అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే వైసిపి అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

వరుస దెబ్బలు

వరుస దెబ్బలు

దీంతో సికె బాబు వైసిపిలో చేరారు. 2014లో పోటీకి దూరంగా ఉన్నారు. అప్పటికే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆయన వర్గం పోటీ చేసినా ఎదురు దెబ్బ తగిలింది. స్వయంగా సికె బాబు భార్య లావణ్య వార్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడారు.

లావణ్య వ్యాఖ్యలు.. ఆ సామాజిక వర్గం దూరం కాకుండా..

లావణ్య వ్యాఖ్యలు.. ఆ సామాజిక వర్గం దూరం కాకుండా..

ఇన్నాళ్లు కాస్త మౌనంగా ఉన్న సికె బాబు.. ఇటీవల వైయస్ వర్ధంతి సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా లావణ్య ఉద్వేగంగా మాట్లాడారు. నియోజకవర్గంలో వైసిపికి తామే వారసులమని ప్రకటించారు. ఆ తర్వాత వైసిపి వారికి షాకిచ్చింది. అయితే, ఓ సామాజిక వర్గం తమకు దూరం కాకుండా ఉండేందుకే వైసిపి వారిపై వేటు వేసిందని అంటున్నారు.

English summary
It is said that YSRCP leader Peddireddy Ramachandra Reddy behind CK Babu exit from YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X