వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ .. బెల్ట్ షాపులు నిర్వహిస్తే పీడీ యాక్ట్ అంటూ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా బెల్టుషాపులపై కొరడా ఝుళిపించాలి అని నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి బెల్టుషాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తామని సంకేతాలను ఇచ్చిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎం కె మీనా ఎక్సైజ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపుల నియంత్రణకు నడుంబిగించింది ఎక్సైజ్ శాఖ.

బెల్టు తీస్తాం అంటున్న ఎక్సైజ్ శాఖ .. బెల్ట్ షాపుల నిర్వాహకులకు వార్నింగ్

బెల్టు తీస్తాం అంటున్న ఎక్సైజ్ శాఖ .. బెల్ట్ షాపుల నిర్వాహకులకు వార్నింగ్

మద్యపాన నిషేధానికి ఏపీలో అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ముందు బెల్ట్ షాపులు లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకుంది ప్రభుత్వం. అందులో భాగంగా బెల్టు షాపుల నిర్వాహకులను పిలిచి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు బెల్టుషాపులు నిర్వహించటం వల్ల అనవసరమైన ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం బెల్టు షాపుల నిర్వహణ పై చాలా సీరియస్ గా ఉందని వారికి అవగాహన కల్పిస్తోంది. ఒకవేళ ఎవరైనా బెల్టుషాపులు నిర్వహిస్తే పిడి యాక్టు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరికలు సైతం జారీ చేస్తోంది ఎక్సైజ్ శాఖ. ఇంతకాలం బెల్టు షాపులను నిర్వహించిన యజమానులు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే ఉపాధి అవకాశాలను కల్పించుకోవాలని సూచిస్తోంది.

పీడీ యాక్ట్ పెడతాం . ..అనవసరంగా కేసుల పాలు కావొద్దు అంటూ హెచ్చరికలు

పీడీ యాక్ట్ పెడతాం . ..అనవసరంగా కేసుల పాలు కావొద్దు అంటూ హెచ్చరికలు

కర్నూలు జిల్లాలో నిర్వహించిన బెల్టు షాపుల యజమానుల అవగాహన కార్యక్రమం లో ఎక్సైజ్ సీఐ ఎం పద్మావతి బెల్టు దుకాణం నిర్వాహకులకు పీడీ యాక్ట్ గురించి వివరించారు. బెల్ట్ షాపులు నిర్వహించిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడుతుందని ఒక సంవత్సర కాలం పాటు కనీసం బెయిల్ కూడా రాదని ఆమె హెచ్చరించారు. కర్నూలు జిల్లాలోని ఈ తాండ్రపాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె బెల్టుషాపుల యజమానులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

బెల్ట్ షాపుల కట్టడి సాధ్యమేనా ...

బెల్ట్ షాపుల కట్టడి సాధ్యమేనా ...

సుమారు యాభై, అరవై గ్రామాలనుండి బెల్ట్ షాపు నిర్వహిస్తున్న యజమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా, అందరూ సంతోషంగా ఉండాలని, బెల్ట్ షాపులను నిర్వహించవద్దని ఆమె వారిని కోరారు.

ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన లిక్కర్ విక్రయించే బెల్టు షాపుల యజమానులు సైతం ఇకనుండి బెల్టు షాపులను నిర్వహించమని, ప్రభుత్వ ఆలోచనకు తమ తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ఊరూరా లెక్కకు మించి బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. బెల్టు షాపుల నిర్వహణ పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన ప్రభుత్వం బెల్ట్ షాపులను కట్టడి చేయడంలో ఏమేరకు సఫలం అవుతుంది అనేది వేచి చూడాల్సిందే.

English summary
The YCP Chief Jagan, who said that the ban of alcohol would be implemented in phases, if they come to power. But it seems that this is not a simple task. At first the government planned to controll the belt shops. they ordered the officials of excise department to take serious action on those who has running the belt shops . Excise CI M Padmavathi has warned of invoking Preventive Detention (PD) Act against belt shop organisers. The Excise department has organised an awareness programme on the disadvantages of belt shops in E Thandrapadu on Friday. Speaking on the occasion, the CI said that organising belt shops is a serious crime. If any person is found organising belt shops in the village then PD Act would be invoked, she warned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X