వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేషన్ తీసుకోవటం లేదా ? అయితే మీ ఆహార భద్రతా కార్డు గోవిందా !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ తీసుకోని లబ్ధిదారుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడంతో చాలామంది రేషన్ బియ్యం తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆసక్తి కనబరచడం లేదు. దీంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య తగ్గడంతో, సదరు రేషన్ తీసుకోని వారిపై ఆరా తీసే పనిలో పడింది ప్రభుత్వం.

వైసీపీలో చేరినా.. తోటత్రిమూర్తులు నాకు శత్రువే: ఏపీ డిప్యూటీ సీఎం.. పార్టీలో దుమారంవైసీపీలో చేరినా.. తోటత్రిమూర్తులు నాకు శత్రువే: ఏపీ డిప్యూటీ సీఎం.. పార్టీలో దుమారం

ఆహార భద్రత కార్డులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన అధికారులు అనర్హుల ఏరివేతలో భాగంగా సరుకులను తీసుకోనటువంటి లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితిపై ఆరా తీసేందుకు సర్కిళ్ల వారీగా సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంది. సదరు లబ్ధిదారులు దారిద్ర రేఖకు దిగువన లేకుంటే వారి ఆహార భద్రతా కార్డులను ఏరి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ అనుసంధానంతో వారికున్న ఆస్తుల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని పన్ను చెల్లింపుదారులను ఇప్పటికే అనర్హులుగా గుర్తించి కార్డులను రద్దు చేసింది ప్రభుత్వం.

beneficiaries who do not take rice they will disqualified

గతంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో ఆహారభద్రత కార్డులను తీసుకు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ తీసుకోని వారిపై ఎంక్వైరీ చేసి వారి కార్డులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. అయితే వరుసగా సరుకులు తీసుకోకున్నా కార్డులు రద్దు కావని వెల్లడించిన శాఖ ఇప్పుడు సరుకులు తీసుకోని వారి కార్డులను రద్దు చేయనుంది.

English summary
Officials in the field of food security cards have decided to conduct a circular-wise survey to check the financial condition of beneficiaries who do not receive goods as part of the disqualification. The beneficiaries have decided to put their food security cards in place if they are not below the poverty line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X