బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: ఇన్ఫోసిస్ లో 9,000 ఉద్యోగాలకు గుడ్ బై, ఎందుకంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశీయంగా నెంబర్ టూ స్థానంలో ఉంటూ ఐటీ సర్వీసులు అందిస్తున్న కంపెనీలో గత ఏడాది కాలంలో 8,000 నుంచి 9,000 మంది ఉద్యోగులకు అభిశంసన పలికనట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించడంతో ఐటీ కంపెనీ ఉద్యోగులు హడలిపోతున్నారు.

టాప్ కంపెనీలో ఉన్న సరైన ప్రదర్శన కనబర్చకపోవడంతో ఉద్యోగులకు ఎసరు తెచ్చిపెడుతున్నది. ఉద్యోగాలు తీసేసిన ఆ సంస్థ ఏదో కాదు ఐటీ సేవల్లో బ్రాండెడ్ కంపెనీగా ముద్రపడిన ఇన్ఫోసిస్ కంపెనీ. గత ఏడాదిలో 8 వేల నుంచి 9 వేల మంది ఉద్యోగులకు అభిశంసన పలికామని ఆ కంపెనీ హ్యూమన్ రిసోర్స్ స్ చీఫ్ కృష్ణమూర్తి శంకర్ చెప్పారు.

అయితే ప్రస్తుతం ఆ ఉద్యోగులు మరింత అడ్వాన్డ్ ప్రాజెక్టులలో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రతి క్వాటర్ లోనూ దాదాపు 2,000 మంది ఉద్యోగులను బయటకు పంపిస్తున్నామని వివరించారు. వారికి స్పెషల్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చిన తరువాతే కంపెనీ నుంచి తీసేస్తున్నామని కృష్ణమూర్తి శంకర్ చెప్పారు.

Bengaluru: Infosys released 9,000 Employees in the past 1 year due Automation

ఈ ట్రైనింగ్ ఉద్యోగులు కొత్త అసైన్ మెంట్లలో సహకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఆటో మేషన్ రంగం తీవ్రంగా విస్తరిస్తుందని, ఈ నేపథ్యంలోనే ఉద్యోగ నియమకాలు తగ్గిపోతున్నాయని కృష్ణమూర్తి శంకర్ వివరించారు.

అయితే కేవలం ఆటోమేషన్ ను కాకుండా అంచనాల మేరకు కంపెనీ రాణించలేకపోతుందని ఆయన మరో కారణం ఎత్తిచూపారు. మొదటి తొమ్మిది నెలల కాలంలో ఇన్ఫోసిస్ కంపెనీ కేవలం 5,700 మంది ఉద్యోగులను మాత్రమే నియమించుకుందని గుర్తు చేశారు.

గతేడాది కాలంలో 17 వేల మంది ఉద్యోగులను కంపెనీలో నియమించుకున్నామని ఆయన చెప్పారు. డిసెంబర్ క్వార్టర్ లో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. పెద్ద పెద్ద ఐటీ సర్వీసు కంపెనీలు ఆటో మేషన్ ప్రక్రియపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తు చేశారు.

సాంప్రదాయ బిజినెస్ బీపీవో, అఫ్లికేషన్ మేనేజ్ మెంట్, ఇన్ ఫ్రాక్ టెర్చర్ మేనేజ్ మెంట్ వాటిపై పెట్టుబడులు తగ్గిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోందని ఆ కంపెనీ హ్యూమన్ రిసోర్స్ స్ చీఫ్ కృష్ణమూర్తి శంకర్ చెప్పారు.

English summary
Infosys has "released" 8,000-9,000 employees in the past one year because of automation of jobs at the lower end of the value chain, the company's human resources head Krishnamurthy Shankar told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X