• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ సంచలనం: రాజధాని అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం -అసెంబ్లీ భేటీకి ముందే కరకట్ట రోడ్డుకు శంకుస్థాపన

|

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వివాదం ఇంకా సమసిపోకముందే, ఇంకొద్ది రోజుల్లోనే ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సంబంధిత కేసుల విచారణ పున:ప్రారంభం కావాల్సి ఉండగా, అతి త్వరలోనే రాజధాని విశాఖపట్నానికి తరలిపోనుందని వైసీపీలో టాప్-2 నేత విజయసాయిరెడ్డి ఘంటాపథంగా చెబుతున్నవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన రీతిలో అమరాతిలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు..

అమరావతిలో జగన్ పూజలు..

అమరావతిలో జగన్ పూజలు..

మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి కరోనా ముందు వరకు అమరావతి ప్రాంతంలో సీఎం జగన్ గానీ, వైసీపీ నేతలుగానీ సెక్యూరిటీ లేకుండా తిరిగిన సందర్భాల్లేవు. కరోనా కారణంగా ఇప్పుడక్కడ రైతుల ఆందోళనలకు బ్రేక్ పడింది. అయితే కొందరు రైతులు మాత్రం ఇళ్లలోనే నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధానుల వివాదం మాటెలా ఉన్నా ప్రస్తుత రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ కావొద్దని భావిస్తోన్న సీఎం జగన్ కీలకమైన పనులను గురువారం భూమి పూజలు చేయనున్నారు.

బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్

నాలుగు లేన్ల కరకట్ట రోడ్డు..

నాలుగు లేన్ల కరకట్ట రోడ్డు..

అమరావతిలో గురువారం సీఎం జగన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు సీఎం భూమిపూజ చేయనున్నారు. కరకట్ట విస్తరణ పనులకు కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేస్తారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ఉండవల్లి కరకట్ట నుంచి వైకుంఠపురం వరకు 15 కిలోమీటర్ల రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. దాంతోపాటు రాజధానిలోని కొన్ని ప్రధాన రహదారులు, హ్యాపీనెస్ట్‌ తదితర ప్రాజెక్టులనూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. గురువారం..

మోదీ పరువు తీసిన గడ్కరీ -వ్యాక్సిన్ల కొరతపై సంచలనం -కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని వ్యాఖ్యమోదీ పరువు తీసిన గడ్కరీ -వ్యాక్సిన్ల కొరతపై సంచలనం -కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని వ్యాఖ్య

శంకుస్థాపన ఆపై శాసనసభకు..

శంకుస్థాపన ఆపై శాసనసభకు..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు వెళ్లే ముందు సీఎం జగన్ అమరావతి కరకట్ట రోడ్డు నిర్మాణ భూమిపూజలో పాల్గొంటారని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. అమరావతి కరకట్ట రోడ్డు విస్తరణ వల్ల ఇబ్రహీంపట్నం, వెంకటపాలెం మధ్య నిర్మించే ఐకాన్ బ్రిడ్జి, కాజ టోల్ గేట్ నుంచి వెంకటపాలెం వరకు నిర్మించ తలపెట్టిన బైపాస్ రోడ్ అనుసంధానానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. కరకట్టరోడ్డు నిర్మాణానికి ఫిబ్రవరిలోనే మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

English summary
in a surprising move, andhra pradesh chief minister ys jagan focuses on amaravati capital. cm jagan to lay foundation for four lane amaravati karakatta road on wednesday. as ap assembly budget session scheduled to start on wednesday, cm jagan will participate amaravati karakatta bhumi pujan then go to assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X