వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి వద్దకు జగన్ తర్వాత బాబు: అఖిలకు షాక్, శిల్పా గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగియనుంది. బుధవారం (23న) పోలింగ్‌, 28న ఫలితాల వెల్లడితో ఉత్కంఠకు తెరపడనుంది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగియనుంది. బుధవారం (23న) పోలింగ్‌, 28న ఫలితాల వెల్లడితో ఉత్కంఠకు తెరపడనుంది.

జగన్-రోజాలపై తీవ్ర వ్యాఖ్యలు: చంపేస్తామంటూ వేణుమాధవ్‌కు ఫోన్లు, ఫిర్యాదుజగన్-రోజాలపై తీవ్ర వ్యాఖ్యలు: చంపేస్తామంటూ వేణుమాధవ్‌కు ఫోన్లు, ఫిర్యాదు

ప్రచారం చివర్లో టిడిపి, వైసిపిలు కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు రెండు రోజుల విస్తృత పర్యటన ఆదివారంతో ముగిసింది.

వారితో జగన్ తర్వాత చంద్రబాబు భేటీ

వారితో జగన్ తర్వాత చంద్రబాబు భేటీ

ఆదివారం ఆయన వరసగా ఆర్య వైశ్య, డ్వాక్రా మహిళలు, ముస్లింలు, కాపు, బలిజ సంఘాల ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతిపక్షనేత జగన్‌ ఇప్పటికే ఆయా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఓట్లు అధికంగా ఉన్న వర్గాలను ఎక్కడో చోట కలిసి, ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముస్లింలు, బలిజ, కాపు ఓట్లు కీలకంగా మారనున్నాయి.

Recommended Video

Nandyal By Polls : Balakrishna Money Distributing To Voters Viral In Social Media | Oneindia Telugu
ముస్లీంలు, కాపు, బలిజలు కీలకం

ముస్లీంలు, కాపు, బలిజలు కీలకం

అంచనా ప్రకారం ఈ నియోజకవర్గంలో ముస్లింలు 51,802 ఉండగా, బలిజ, కాపులు కలిసి 38వేలు, ఆర్యవైశ్యులు 11వేలు వరకు ఉంటారని అంచనా.

నియోజకవర్గ పక్క గ్రామాల్లో ఉంటూ

నియోజకవర్గ పక్క గ్రామాల్లో ఉంటూ

ఎన్నికల నిబంధన ప్రకారం సోమవారం సాయంత్రం ప్రచారం ముగిశాక ఇతర జిల్లాల నేతలు ఎవ్వరూ నంద్యాలలో ఉండవద్దు. ఇప్పటి వరకు నంద్యాలలో ఉంటూ సందడిగా తిరిగిన నాయకులు మంగళ, బుధవారాల్లో పక్క గ్రామాల నుంచి పర్యవేక్షణ సాగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సోషల్ మీడియా ద్వారా ప్రచారం

సోషల్ మీడియా ద్వారా ప్రచారం

సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీల వద్ద ఓటర్ల ఫోన్‌ నంబర్లు ఉన్నందున ప్రత్యేక యాప్‌లతో వారికి సంక్షిప్త సమాచారాలను పంపనున్నారు. ఇందుకు సంబంధించి యాప్‌లను రూపొందించారు. ఎవరైనా ఓటు వేయడానికి రాకపోతే పోలింగ్‌ బూత్‌లోని ఏజెంటు సమాచారం ఆధారంగా వారి సెల్‌ఫోన్‌కు సమాచారమిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

బెట్టింగుల జోరు

బెట్టింగుల జోరు

నంద్యాలలో ఇప్పుడు బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనే కాకుండా, హైదరాబాద్‌, బెంగళూరులలోనూ టిడిపి,వైసిపి అభ్యర్థుల గెలుపోటములపై పందేలు నడుస్తున్నాయి. భూమా బ్రహ్మానంద రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిల మెజార్టీల పైనా బెట్టింగ్ కాస్తున్నారు. ఎక్కువ బెట్టింగులు శిల్పా గెలుపుపై జరుగుతున్నాయని తెలుస్తోంది.

English summary
Betting favours to YSR Congress Party MLA candidate Silpa Mohan Reddy in Nandyal bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X