హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'విడదీయడం చిరంజీవివల్ల, ఆయన తాతవల్లగానీ కాదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వల్లగానీ, ఆయన తాతవల్ల గానీ తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలంను విడదీయడం సాధ్యం కాదని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శనివారం మండిపడ్డారు. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని సీమాంధ్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని కానీ అది కుదిరే పని కాదన్నారు.

దమ్ముగూడెం ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి ఏమైనా నియంతనా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును తాను ఓ సోదరుడిగా గౌరవిస్తానని అయితే అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినట్లు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పడం సరికాదన్నారు.

జనవరి నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. డిసెంబర్ 23లోగా తెలంగాణ బిల్లు పార్లమెంటులో నెగ్గుతుందని ఆయన చెప్పారు.

సరిహద్దులే మారుతాయి: జెపి

రాష్ట్ర విభజన జరిగితే సరిహద్దులే మారుతాయని భాష, సంస్కృతి, సంప్రదాయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వేరుగా అన్నారు. రాజ్యాధికారం సోనియా గాంధీ రాసిన పత్రం కాదన్నారు. మెట్రోను కూల్చుతామని చెప్పడం వాటాలు అందకనా లేక అభివృద్ధి కాంక్ష లేకనా అని ప్రశ్నించారు.

బాబుపై జూపూడి మండిపాటు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు రాజకీయంగా యావజ్జీవ శిక్ష విధించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు అన్నారు. రెండుసార్లు ప్రజలు తిరస్కరించిన బాబు మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

English summary
Congress Party MP Palvai Goverdhan Reddy on Saturday said Bhadrachalam will be in Telangana, people will not allow submersion by Polavaram dam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X