అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకలు ఆదివారం ప్రశాంతి నిలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 8 గంటలకు సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. సత్యసాయి కళాశాలలకు చెందిన విద్యార్థులు బ్రాస్‌బ్యాండ్‌ మేళంతో సత్యసాయికి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. బాబా సమాధివద్ద కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు రూ. 80 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాన్ని చినరాజప్ప ప్రారంభించారు. ట్రస్టు చేపట్టిన రూ.80 కోట్ల బృహత్తర తాగునీటి పథకాన్ని తాను ప్రా రంభించడం అదృష్టంగా భావిస్తున్నానని చినరాజప్ప పేర్కొన్నారు.

కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌వాలా మాట్లాడుతూ భారతదేశం పుణ్యపురుషుల నిలయమని అభివర్ణించారు. భారతీయ సంస్కృతిని ఉద్ధరించడానికి పుణ్యపురుషులు స్వామి వివేకానంద వంటి వారు అవతరించారని, సత్యసాయి సైతం అవతార పురుషుడేనని కొనియాడారు.

సత్యసాయి సనాతన ధర్మాలు, ప్రేమతత్వం, ఆధ్యాత్మికత, మానవతా విలువలను తెలియజేస్తూ చేపట్టిన సేవాకార్యక్రమాలతో భగవత్‌స్వరూపుడిగా పూజలందుకుంటున్నారన్నారు. గవర్నర్‌, ఉపముఖ్యమంత్రితో పాటు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వీవీఐపీలు మహాసమాధిని దర్శించుకున్నారు.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు


భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకల్లో ఆదివారం ప్రశాంతి నిలయంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలా పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తున్న దృశ్యం.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకల్లో ఆదివారం ప్రశాంతి నిలయంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలాకు పుష్పగుచ్చం ఇస్తున్న ఏపీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకల్లో ఆదివారం ప్రశాంతి నిలయంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలాతో కరచాలనం చేస్తున్న ఏపీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకల్లో ఆదివారం ప్రశాంతి నిలయంలో పాల్గొనేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తున్న దృశ్యం.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకల్లో ఆదివారం ప్రశాంతి నిలయంలో పాల్గొనేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్పకు పుష్పగుచ్చం ఇస్తున్న ఏపీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకల్లో ఆదివారం ప్రశాంతి నిలయంలో పాల్గొనేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్పతో కరచాలనం చేస్తున్న ఏపీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకల్లో ఆదివారం ప్రశాంతి నిలయంలో పాల్గొనేందుకు వస్తున్న కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలా, ఆంధ్రప్రదేశ్ ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప, ఏపీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

భగవాన్‌ సత్యసాయిబాబా 89 జయంతి వేడుకల్లో ఆదివారం ప్రశాంతి నిలయంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలాకు పుష్పగుచ్చం ఇస్తున్న ఏపీ మంత్రి పరిటాల సునీత.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌వాలా మాట్లాడుతూ భారత్‌ పుణ్యపురుషుల నిలయమని అభివర్ణించారు. భారతీయ సంస్కృతిని ఉద్ధరించడానికి పుణ్యపురుషులు స్వామి వివేకానంద వంటి వారు అవతరించారని, సత్యసాయి సైతం అవతార పురుషుడేనని కొనియాడారు.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ట్రస్టు నిర్వహణ, సేవలకు సంబంధించి ప్రతి ఏడాదీ వార్షిక నివేదికను వెలువరిస్తున్నామన్నారు. మానవసేవే మాధవసేవ అన్న సత్యసాయి బోధనలను తాము ఆచరిస్తూ సేవలు కొనసాగిస్తున్నామన్నారు. అ నంతరం ట్రస్టు వార్షిక నివేదికను గవర్నర్‌ విడుదల చేశారు.

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

23 సంవత్సరాల క్రితమే పుట్టపర్తిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, 16 సంవత్సరాల క్రితం బెంగుళూరులో మరో ఆస్పత్రిని నిర్మించి అతి ఖరీదైన వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందించిన భగవత్‌ స్వరూపుడు సత్యసాయి అన్నారు.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌ కొండలరావుకు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప సన్మానం చేశారు. సాయంత్రం బంగారు రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతి నిలయంలో ఊరేగించారు.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ట్రస్టు చేపట్టిన రూ.80 కోట్ల బృహత్తర తాగునీటి పథకాన్ని తాను ప్రా రంభించడం అదృష్టంగా భావిస్తున్నానని చినరాజప్ప పేర్కొన్నారు.

 ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి 89వ జయంతి వేడుకలు

విదేశీయులు తయారు చేసిన బర్త్‌డే కేక్‌పై జ్యోతిని వెలిగించి కట్‌ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, భక్తులు కేక్‌లను తీసుకొచ్చి మహా సమాధి వద్ద ఉంచారు. అనంతరం సత్యసాయి ప్రసంగం సీడీని ప్రసారం చేశా రు. ప్రేమతత్వం, మానవుడు తెలుసుకోవాల్సిన విలువలపై సత్యసాయి చేసిన ప్రసంగం వింటూ భక్తులు లీనమైపోయారు.

సాయికుల్వంత్‌లో ప్రముఖ కర్ణాటక సంగీత గాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కచేరి నిర్వహించారు. సత్యసాయిబాబా జయంతి వేడుకలకు దేశవిదేశాలకు చెందిన వేలాది భక్తులు తరలివచ్చారు. సత్యసాయి జయంత్యుత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో కర్ణాటక గవర్నర్‌ వాజుభాయ్‌వాలా, ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత పాల్గొన్నారు.

English summary
Prasanthi Nilayam witnessed a regal Chariot Festival followed by a most enchanting Jhoola function accompanied by a Carnatic Concert by legendary Dr M Balamuralikrishna this evening, celebrating the 89th Birthday of Bhagawan Sri Sathya Sai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X