విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పిలుపు, జతకలిసిన టీడీపీ: నాలుగేళ్లుగా ఏం చేయలేదని చంద్రబాబు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని భారత్ బంద్‌లో 21 విపక్ష పార్టీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా కాంగ్రెస్, జనసేన, తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీలు పాల్గొన్నాయి. బంద్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. అయితే బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో వాహనాలు తిరిగాయి.

Recommended Video

టీడీపీతో పొత్తుపై ఉత్తమ్‌ క్లారిటీ

<strong>కాంగ్రెస్‌ ఇచ్చిన బంద్‌ పిలుపును ఎవరూ పట్టించుకోవట్లేదు. వారి మహాకూటమి బెలూన్‌ త్వరలోనే పేలిపోతుంది'</strong>కాంగ్రెస్‌ ఇచ్చిన బంద్‌ పిలుపును ఎవరూ పట్టించుకోవట్లేదు. వారి మహాకూటమి బెలూన్‌ త్వరలోనే పేలిపోతుంది'

పెట్రో ధరలను నిరసిస్తూ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, విపక్షాలు బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Bharat Bandh: TDP organises protests against petrol price rise, Chandrababu says hike becoming unbearable burden

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కూడా పాల్గొంది. పలుచోట్ల ఆందోళనలో పాల్గొన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని వర్గాలకు భారంగా మారిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరలు తగ్గించేందుకు నాలుగేళ్లుగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు పెట్రోల్, డీజిల్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది సామాన్యుడిపై భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Scores of Opposition workers were taken into custody across Andhra Pradesh on Monday as they staged protests as part of the 'Bharat Bandh'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X