వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమవరం జనసేనలో అసంతృప్తి ... పవన్ అభిమానుల పరిస్థితి ఏంటో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

తీవ్ర అసంతృప్తితో ఉన్న జనసైనికులు | Bhimavaram Janasena Fans Upset With Pawan Kalyan Attitude

భీమవరం లో జనసేన పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంటికే పరిమితమయ్యారా ? గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి పాలవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందా ? భీమవరంలో పార్టీ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.

భీమవరంలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్య గోచరం

భీమవరంలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్య గోచరం

భీమవరంలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోటగా భావించారు. ఇటీవలి ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి పాలయ్యారు. పవన్ ఇక్కడ నుండి పోటీ చేయడంతో పవన్ అభిమానులు, జన సేన మద్దతుదారులు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డారు. పవన్ ను అభిమానించేవారు కొందరు ఎన్నికల కోసం సొంత డబ్బులు సైతం ఖర్చు చేశారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ భీమవరంలో ఉండి మరీ ప్రచారం నిర్వహించిన ఫలితం మాత్రం శూన్యం.

 ఇంటికి పరిమితమై, తమ సొంత వ్యవహారాలను చూసుకుంటున్న జనసేన నేతలు

ఇంటికి పరిమితమై, తమ సొంత వ్యవహారాలను చూసుకుంటున్న జనసేన నేతలు

పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయిన పవన్ పార్టీ భీమవరంలో ఘోర ఓటమిని చవిచూసింది. భీమవరంలోని స్థానిక నాయకత్వ లోపం వల్లే జనసేనాని ఓటమిపాలయ్యారు అనేది ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం. ఇక ఆ తర్వాత భీమవరంలో జనసేన పార్టీ కనుమరుగయ్యింది అన్న పరిస్థితి నెలకొంది. జనసేన నాయకులు గానీ, పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ పవన్ పార్టీ కోసం ప్రస్తుతం పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక అక్కడ ఉన్న జనసేన క్యాడర్ కు నాయకులు లేరు. ఎవరికి వారి ఇంటికి పరిమితమై, తమ సొంత వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇక సెప్టెంబర్ లో జరిగే మున్సిపల్ ఎన్నికలపై క్యాడర్ ప్రస్తుతం ఆందోళన చెందుతోంది.

నాయకులు లేక నడిపించేవారు లేక ఇబ్బంది పడుతున్న జనసేన క్యాడర్

నాయకులు లేక నడిపించేవారు లేక ఇబ్బంది పడుతున్న జనసేన క్యాడర్

నాయకులు లేక నడిపించేవారు లేక, అధినేత పవన్ కళ్యాణ్ పట్టింపు లేక భీమవరంలో జనసేన పార్టీ కుదేలవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినప్పటికీ, ఓటమిబాధ నుండి ఇంకా కోలుకోని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపటంలో పవన్ కళ్యాణ్ విఫలం అవుతున్నారు. ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నింపి, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. నాయకత్వ లోపం ఉన్న భీమవరం నియోజకవర్గంలో బలమైన నాయకులపై పవన్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అయినా భీమవరంపై దృష్టి సారించాలని కోరుతున్న జనసేన నేతలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అయినా భీమవరంపై దృష్టి సారించాలని కోరుతున్న జనసేన నేతలు

ఒక పక్క పోరాడుతానని చెబుతున్న పవన్ కళ్యాణ్, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పవన్ పార్టీ చావు దెబ్బ తినే ప్రమాదం ఉంది.

ఏది ఏమైనప్పటికీ ఊపిరి ఉన్నంతవరకు జనసేన పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆదర్శాలు గొప్పవే కానీ ఆచరణలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంపై దృష్టి సారించి పార్టీ కేడర్ను బలోపేతం చేసి ముందుకు నడిస్తే తప్ప పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తి తగ్గేలా లేదు.

English summary
Pawan Kalyan reckoned Bhimavaram as Jana Sena Party's fort and so he contested from here in the recent elections. Pawan fans and Jana Sena supporters worked day and night for the party. Many of them put their own money for the election campaign as they worship Pawan. During the election campaign, Pawan stayed for couple of days in Bhimavaram which ignited the spirit in party cadre.However, Pawan later shifted his focus on other constituencies and left the campaign to the cadre. Despite trying too hard, Pawan lost miserably. The local leaders failed in poll management and could not analyze the opposition strategies. Few opined that if Pawan had been in the constituency at least on the polling day, things would have been different now.The cadre lacks a leadership and with no other option, they are confining themselves to homes or minding their own business. Now the cadre are worried about the municipal elections which are likely to be held in September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X