• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భూమా అఖిలప్రియ నోరు విప్పారు .. వైసీపీ హయాంలో ప్రతి పనికి ఓ ఫిక్స్ రేటు అని ఏకిపారేశారు

|

నిన్న మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్నా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఒక్కసారిగా వైలెంట్ గా మారారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసిపి పాలన దోపిడి పాలన అంటూ ఆమె ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్ చేశారంటూ ఆరోపణలు గుప్పించారు భూమా అఖిల ప్రియ.వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రామ వాలంటీర్ పోస్టులకు సైతం డబ్బులు వసూలు చేస్తున్నారని అఖిల ప్రియ ఆరోపిస్తున్నారు.

పోలవరం గురించి అడిగితే ప్రభుత్వం పారిపోతోంది: దేవినేని ఫైర్

ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేశారని మండిపడుతున్న మాజీ మంత్రి అఖిలప్రియ

ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేశారని మండిపడుతున్న మాజీ మంత్రి అఖిలప్రియ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని, ఎక్కడికక్కడ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భూమా అఖిలప్రియ. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్లకు ఒక రేటు, సబ్ స్టేషన్ లో ఉద్యోగానికి ఒక రేటు, రోడ్ కావాలంటే ఒక రేటు, ఇల్లు కావాలంటే ఒక రేటు , బోర్ కావాలంటే ఒక రేటు ఇలా రేట్లు ఫిక్స్ చేసి మరీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వసూళ్ళకు దిగుతుందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఇది ఆళ్లగడ్డ ప్రజల దౌర్భాగ్య పరిస్థితి అని భూమా అఖిలప్రియ ఆరోపించారు. కడప, నెల్లూరు జిల్లాల నుంచి వస్తున్న ప్రజలను ఎవరిని కదిలించినా ఈ విషయం చెబుతున్నారని భూమా అఖిలప్రియ తెలిపారు.

గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కాదు .. 50 ఇళ్ళ పనోళ్ళు అని సంచలన వ్యాఖ్య చేసిన అఖిల

గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కాదు .. 50 ఇళ్ళ పనోళ్ళు అని సంచలన వ్యాఖ్య చేసిన అఖిల

గ్రామ వాలంటీర్ పోస్టుల ఉద్యోగానికి ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్నలు వింటే హాస్యాస్పదంగా ఉన్నాయని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు . ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి చెల్లిపేరు ఏంటి, జగన్మోహన్ రెడ్డి తల్లిపేరు ఏంటి, జగన్ ఇంటి అడ్రస్ ఏంటని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక అంతే కాదు వైసిపి నాయకులు లిస్ట్ ఇచ్చిన వారిని ఎంపిక చేస్తున్నారని, గ్రామ వాలంటీర్ల ఎంపిక చాలా అన్యాయంగా జరుగుతుంది అంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. ఇక గ్రామ వాలంటీర్ల పోస్టులను ఉద్యోగాలు అనరని, చదువుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వారికి, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు అవకాశం ఇస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిగ్రీలు చదువుకున్న వారికి ఒక బండి ఇచ్చి దానిలో సరుకులు ఇచ్చి ఇంటింటికి పోయి అమ్మాలంట అంటూ సెటైర్లు వేశారు. దానికా మీరు డిగ్రీలు చేసింది అంటూ భూమా అఖిల నిలదీశారు.

ఇక అలా చేసే వాటిని ఉద్యోగాలు అనరని 50 ఇళ్లకు పనోళ్లు అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దౌర్భాగ్యపరిస్థితిలో రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వ పుణ్యమా అంటూ బతకాల్సి వస్తుందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్ పాలన అరాచకం .. రౌడీలు, గుండాల రాజ్యం అన్న భూమా అఖిల ప్రియ

జగన్ పాలన అరాచకం .. రౌడీలు, గుండాల రాజ్యం అన్న భూమా అఖిల ప్రియ

అంతే కాదు జగన్ పాలనపై , అసెంబ్లీలో వై సీపీ ప్రవర్తించిన తీరుపై అఖిల ప్రియ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు చూసిన ప్రజలు తలలు బాదుకున్నారని, ఇలాంటి వారికా తాము అధికారం కట్టబెట్టింది అని బాధ పడ్డారని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. రౌడీలు, గూండాల్లా కొట్టుకునే పరిస్థితి అసెంబ్లీలో ఉందని ఆమె ఆన్నారు . జగన్ వస్తే వర్షాలు కురుస్తాయని చెప్పారని, వర్షాలు కురిసే మాట దేవుడెరుగు.. ఉన్న నీరు ఆవిరైపోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని ఓడించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని అఖిల ప్రియ కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Bhooma Akhilapriya has been Violent One until yesterday. The YSR Congress government has been severely incensed. She lamented that the YCP rule was a loot rule. The YSR Congress government has been accused of fixing a rate for every work.Akhila Priya alleges that YSR Congress government is also collecting money for the recently announced village volunteer posts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more