అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి కోసం భువనేశ్వరి ఎమోషనల్.. రాజధాని పోరాటం వెనుక అసలు కారణం ఇదే..

|
Google Oneindia TeluguNews

రాజధాని అమరావతి కోసం చేస్తున్న పోరాటం విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గమని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోరాటం సాగిస్తున్న తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది . వై సీపీ నేతల విమర్శలను లెక్క చెయ్యకుండా రాజధాని రైతుల పోరాటంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు భువనేశ్వరి. రాజధాని 5 కోట్ల ఆంధ్రుల హక్కు అంటున్న భువనేశ్వరి సేవ్ అమరావతి అని స్టాండ్ తీసుకోవటం , రాజకీయంగా ముందుకు రావటం ఆసక్తికరంగా మారింది.

 రాజధాని ఆ ప్రాంత రైతుల హక్కు

రాజధాని ఆ ప్రాంత రైతుల హక్కు

రాజధాని ప్రాంత రైతులు తమ భవిష్యత్ , తమ పిల్లల భవిష్యత్ బాగుంటుంది అని చంద్రబాబును నమ్మి పండే పంట భూములు ఇచ్చారని , కానీ ఇప్పుడు వారికి అన్యాయం జరిగే పరిస్థితి ఉందని అందుకే పోరాటం సాగిస్తునారని భువనేశ్వరి పేర్కొన్నారు. రాజధాని ఆ ప్రాంత రైతుల హక్కు అని భువనేశ్వరి పేర్కొన్నారు. రాజధాని రైతుల పోరాటానికి బాసటగా తాను ఉంటానని చెప్పారు.
అమరావతి నుండి విశాఖపట్నానికి రాజధానిని మార్చడాన్ని నిరసిస్తున్న రైతులకు మద్దతుగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి మాట్లాడారు.

Recommended Video

Chandrababu's Strategy Behind The Entry Scene Of Bhuvaneshwari & Brahmani ? || Oneindia Telugu
రాజధాని పోరాటంలో పాల్గొనాలని మహిళలకు భువనేశ్వరి పిలుపు

రాజధాని పోరాటంలో పాల్గొనాలని మహిళలకు భువనేశ్వరి పిలుపు


రైతులతో పాటు మహిళలు ఉద్యమం సాగిస్తున్నారన్న భువనేశ్వరి మహిళాలోకం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు . రైతుల నిరసనకు మద్దతుగా భువనేశ్వరి ఇతర ప్రాంతాల మహిళలకు పిలుపునిచ్చారు.అమరావతిలో రైతులు రాజధాని మార్పు నిర్ణయంతో సంతోషంగా లేరన్న ఆమె రాజధానిగా అమరావతినే కొనసాగాలని పేర్కొన్నారు.

రైతులకు బాసటగా భువనేశ్వరి

రైతులకు బాసటగా భువనేశ్వరి

భువనేశ్వరి ప్రత్యక్షంగా రాజధాని రైతుల పోరాటంలో పాలు పంచుకోవటంతో పలు విమర్శలు వ్యక్తం అవుతున్నా ఆమె మాత్రం రాజధాని అమరావతి కోసం తన గళాన్ని వినిపిస్తున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. రాజధాని ప్రాంత రైతుల పోరాటంలో న్యాయం ఉందని చెప్తున్నారు.ఇక రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న మహిళలపై దాడులను ఖండించిన ఆమె రాజధాని అమరావతి సాధించుకునే వరకు పోరాటం సాగించాలని , అందుకు తమ కుటుంబం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

రాజధాని కోసం చంద్రబాబు కష్టం..

రాజధాని కోసం చంద్రబాబు కష్టం..

చంద్రబాబు రాజధాని అమరావతిపై ఎన్నో కళలు కనరాని చెప్పిన ఆమె కుటుంబాన్ని లక్ష్య పెట్టకుండా రాజధాని కోసం చంద్రబాబు పడిన తపనను రాజధాని గ్రామాల ప్రజలకు వినిపించి వారిలో స్ఫూర్తి నింపారు.రాజధాని 5 కోట్ల ఆంధ్రుల హక్కు అని ఆమె గట్టిగా చెప్పారు. తన కొడుకు, మనవడి కోసం తాను మాట్లాడటం లేదన్న భువనేశ్వరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోసం తాను ఒక ఆంధ్రురాలిగా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు . మొత్తానికి తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాజధాని అమరావతి కోసం భువనేశ్వరి ఇంత గట్టిగా నిర్ణయం తీసుకోవటం రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన కృషి ఉందని, అది స్వయంగా భువనేశ్వరి చూశారని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు .

ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలని

ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలని


ఏపీని నంబర్ వన్ గా చేయడానికి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని, అహర్నిశలు పరితపించారని చెప్పుకొచ్చారు. రాత్రింబవళ్లు చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడ్డారని, రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా నిర్మాణం చేసి అమరావతికి పెట్టుబడులు ఆకర్షించాలని చంద్రబాబు పడిన కష్టమే భువనేశ్వరిని ఇప్పుడు రాజధాని రైతుల కోసం పోరాటం సాగించేలా చేస్తుందని తెలుగు తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతలు మూకుమ్మడిగా భువనేశ్వరి మీద మాటల దాడి చేస్తున్నా ఆమె మాత్రం రాజధాని కోసం పోరాటంలో నేను సైతం అనటం వెనుక ఉన్న బలమైన కారణం ఇదే అంటున్నారు టీడీపీ నేతలు .

English summary
Nara Bhuvaneshwari, wife of TDP President N Chandrababu Naidu spoke in support of farmers, who are protesting against the shifting of capital from Amaravati to Visakhapatnam. Speaking to the media, she praised women for participating in stir along with farmers. Bhuvaneshwari gave a call to women of other regions to support the protest of farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X