వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వివాదంలో చిక్కుకున్న మంత్రి అఖిలప్రియ

ఇప్పటికే నంది అవార్డుల వివాదం కొనసాగుతుండగా.. మరో వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆదివారం జరిగిన ‘సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు' కార్యక్రమం ఈ తాజా వివాదానికి కారణంగా నిలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇప్పటికే నంది అవార్డుల వివాదం కొనసాగుతుండగా.. మరో వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆదివారం జరిగిన 'సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు' కార్యక్రమం ఈ తాజా వివాదానికి కారణంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనెకి అవార్డు ఇచ్చారు.

Recommended Video

Social Media Summit Awards : Deepika Padukone received Award

'థాంక్యూ అమరావతి': దీపికా ఏమన్నారంటే, రానా ఇలా(పిక్చర్స్)'థాంక్యూ అమరావతి': దీపికా ఏమన్నారంటే, రానా ఇలా(పిక్చర్స్)

 ఇప్పుడిదే చర్చకు దారితీసింది..

ఇప్పుడిదే చర్చకు దారితీసింది..

ఇప్పుడిదే మరో చర్చకు దారితీసింది. ఆదివారం ఏపీ రాజధాని అమరావతిలో సోషల్ మీడియా సమ్మిట్-2017 జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె, టాలీవుడ్ హీరో రానా, సంగీత దర్శకుడు అనిరుధ్, షార్ట్ ఫిల్మ్ హాస్యనటుడు వైవా హర్షలకు అవార్డులు అందజేశారు.

 టాలీవుడ్‌లో ఎవరూ లేరా?

టాలీవుడ్‌లో ఎవరూ లేరా?

అయితే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం కాబట్టి టాలీవుడ్ నటులకు ఇవ్వాలికానీ.. బాలీవుడ్ నటికి ఇవ్వడమేంటని ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంపై నెటిజన్లు సైతం ఘాటుగానే విమర్శిస్తున్నారు.

 నెటిజన్ల ఆగ్రహం..

నెటిజన్ల ఆగ్రహం..

తాజాగా, దీపిక నటించిన పద్మావతి సినిమా వివాదాల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా దీపికకు అవార్డు ఇవ్వడం పట్ల కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా టాలీవుడ్‌లో దీపిక స్థాయిలో ఎవరూ కనిపించలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

 మరో తలనొప్పి

మరో తలనొప్పి

ఇప్పటికే నంది అవార్డుల వివాదంలో సతమతమౌతున్న ప్రభుత్వానికి ఇప్పుడు ఈ వివాదం మరో తలనొప్పి మారిందని తెలుస్తోంది. ఇది ఇక్కడితో ఆగిపోతుందా? మరింత చర్చకు దారితీస్తుందా? అనేది వేచి చూడాలి. కాగా, ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడి 22మంది ప్రాణాలు పోయిన విషాద ఘటన కూడా విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే.

English summary
Andhra Pradesh minister Bhuma Akhila Priya in another Controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X