నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి ప్రకటనతో అఖిలప్రియ ఆశ్చర్యం, విజయమ్మను కలిశారా?

నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి తరఫున తన సోదరుడు బ్రహ్మానంద రెడ్డి బరిలోకి దిగుతారని, ఏకగ్రీవం కోసం అందరూ సహకరించాలని మంత్రి అఖిలప్రియ కోరుతున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి తరఫున తన సోదరుడు బ్రహ్మానంద రెడ్డి బరిలోకి దిగుతారని, ఏకగ్రీవం కోసం అందరూ సహకరించాలని మంత్రి అఖిలప్రియ కోరుతున్నారు.

అఖిలప్రియకు వైసిపి ఝలక్: నంద్యాల అభ్యర్థిని ప్రకటించిన బంధువు అఖిలప్రియకు వైసిపి ఝలక్: నంద్యాల అభ్యర్థిని ప్రకటించిన బంధువు

అయితే, కర్నూలు వైసిపి నేత కాటసామి రాంరెడ్డి రెండు రోజుల క్రితం పార్టీ ప్లీనరీలో హఠాత్తుగా రాజగోపాల్ రెడ్డి తమ పార్టీ తరఫున నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు.

నంద్యాలపై చక్రం తిప్పిన అఖిలప్రియ: సరేనన్న విజయమ్మ, జగన్ మాటేమిటో...నంద్యాలపై చక్రం తిప్పిన అఖిలప్రియ: సరేనన్న విజయమ్మ, జగన్ మాటేమిటో...

షాకైన అఖిలప్రియ

షాకైన అఖిలప్రియ

ఏకగ్రీవం కోసం అఖిల ప్రయత్నిస్తుంటే, వైసిపి నుంచి ఆ ప్రకటన రావడం ఆమెను షాక్‌కు గురి చేసింది. దీంతో అఖిలప్రియ వెంటనే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే విజయమ్మ ద్వారా ఆమె ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది.

విజయమ్మను కలిసిన అఖిలప్రియ..

విజయమ్మను కలిసిన అఖిలప్రియ..

తాజాగా, ఆమె విజయమ్మను కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె విజయమ్మను కలిసినట్లుగా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. రాజకీయంగా విభేదాలున్నప్పటికీ.. వైయస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఈ నేపథ్యంలో ఆమె.. విజయమ్మను కలిశారని అంటున్నారు.

వైయస్ కుటుంబంతో సాన్నిహిత్యం..

వైయస్ కుటుంబంతో సాన్నిహిత్యం..

అంతేకాదు, తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలకు వైయస్ కుటుంబం, జగన్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని అఖిలప్రియ.. విజయమ్మ వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. తన సోదరుడు బ్రహ్మానంద రెడ్డికి ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరారని సమాచారం.

గంగుల ప్రతాప్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి

గంగుల ప్రతాప్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి

కాగా, ఇప్పటికే వైసిపి తరఫున తాను బరిలో ఉంటానని గంగుల ప్రతాప రెడ్డి చెప్పారు. మరోవైపు, నంద్యాల వైసిపి ప్లీనరీలో కర్నూలు జిల్లా నేతలు నియోజకవర్గ ఇంచార్జి రాజగోపాల్ రెడ్డి పేరును తెరపైకి తీసుకు వచ్చారు.

టిడిపిలోను సస్పెన్స్...

టిడిపిలోను సస్పెన్స్...

ఇంకోవైపు, టిడిపి అధిష్ఠానం కూడా నంద్యాల బరిలో ఎవరుంటారన్న విషయమై ఎటువంటి ప్రకటనా చేయలేదు. సీటు తమ కుటుంబానిదే కాబట్టి తమకు అవకాశం ఇవ్వాలని భూమా కుటుంబం, పార్టీలో అనాదిగా ఉంటున్న తనకు అవకాశం ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతుండటంతో నంద్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది.

English summary
It is said that Minister Akhila Priya met YSR Congress Party honorary president YS Vijayamma for Nandyal by elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X