నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాల మాదే: బ్రహ్మానందరెడ్డి, శిల్పా ధీమా, ఏం చెప్పారంటే..?

రాష్ట్రమంతా ఎదురుచూస్తున్న నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడుతున్న నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: రాష్ట్రమంతా ఎదురుచూస్తున్న నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడుతున్న నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాగా, నంద్యాల ఉపఎన్నికలో గెలుపుపై టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు మాదే..

గెలుపు మాదే..

ఎన్ని ప్రలోబాలు పెట్టినా ప్రజలంతా తమవైపే ఉన్నారని సోమవారం ఉదయం శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అండ, తన సొంత బలంతో తామే గెలుస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని స్పష్టం చేశారు.

తమవైపే ప్రజలు..

తమవైపే ప్రజలు..

ఇది ఇలావుంటే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, భూమా నాగిరెడ్డి చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకుని టీడీపీనే గెలిపిస్తున్నారని చెప్పారు. ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పారు.

Recommended Video

Nandyal By-Election : Lagadapati Rajagopal Gives Clarity After Polling | Oneindia Telugu
విజయం మా వైపే..

విజయం మా వైపే..

80శాతం వరకు ఓటింగ్ నమోదు కావడం తమకే సానుకూల ఫలితాన్నిస్తుందని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. వైయస జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తమకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

ఉత్కంఠ.. కాకినాడపై ప్రభావం

ఉత్కంఠ.. కాకినాడపై ప్రభావం

టీడీపీ, వైసీపీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో ఏ పార్టీ గెలిచినా ఆ ప్రభావం తాజాగా జగరనున్న కార్పొరేషన్ ఎన్నికలపై ఉంటుందని తెలుస్తోంది. ఏ పార్టీకి గెలిచినా ఆ పార్టీకి అనుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

English summary
TDP MLA candidate Bhuma Brahmananda Reddy and Shilpa Mohan Reddy responded on Nandyal polling results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X