కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దటీజ్ భూమా నాగిరెడ్డి: మాటిస్తే... ఇదీ నిదర్శనం, అందుకే ఫ్యాక్షన్ వైపు...

దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఫ్యాక్షన్ నేతగా ముద్రపడ్డారు. అదే భూమా తన అనుచరుల కోసం, నియోజకవర్గం కోసం పనులు చేయడంలో ముందుండేవారు. అందుకే ఆళ్లగడ్డ, నంద్యాల కన్నీరుమున్నీరు అవుతోంది.

|
Google Oneindia TeluguNews

ఆళ్లగడ్డ: దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఫ్యాక్షన్ నేతగా ముద్రపడ్డారు. అదే భూమా తన అనుచరుల కోసం, నియోజకవర్గం కోసం పనులు చేయడంలో ముందుండేవారు. అందుకే ఆళ్లగడ్డ, నంద్యాల కన్నీరుమున్నీరు అవుతోంది. అనుచరులకు ప్రాధాన్యతను ఇచ్చేవారు.

<strong>జగన్‌ను జైల్లో చూసొచ్చి నా తల్లి ఏడ్చేది: అఖిల కౌంటర్, భూమా 'బాధ'పై</strong>జగన్‌ను జైల్లో చూసొచ్చి నా తల్లి ఏడ్చేది: అఖిల కౌంటర్, భూమా 'బాధ'పై

ఫ్యాక్షన్ రాజకీయాలవైపు మళ్లాల్సి వచ్చిందని..

ఫ్యాక్షన్ రాజకీయాలవైపు మళ్లాల్సి వచ్చిందని..

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి వచ్చారు. భూమా కూడా తాను అనుకోని పరిస్థితుల్లో ఫ్యాక్షన్ వార్‌లోకి దిగాల్సి వచ్చిందని పలు సందర్భాల్లో చెప్పారు. రాయలసీమలో కీలక నాయకుడు. ఎప్పుడు అనుచరులను వంచించలేదు. సొంతవాళ్లలా చూసుకునేవాడు.

ఏదైనా హామీ ఇస్తే..

ఏదైనా హామీ ఇస్తే..

తన వారికి లేదా ఎవరికైనా హామీ ఇస్తే మాట తప్పవాడు కాదు. అందుకు తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలే మంచి నిదర్శనం. శిల్పా సోదరులతో రాజకీయ వైరం ఉంది. చంద్రబాబుకు ఇచ్చిన హామీ మేరకు శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించే బాధ్యతను భుజన వేసుకున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చక్రపాణి గెలవకుంటే తప్పితం తమ నుండే అని భావించవచ్చునని చెప్పారు. తద్వారా రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. ఆయన గెలుపు కోసం ఎంత చిత్తశుద్ధితో ఆయన పని చేయాలని భావించారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

మరో నిదర్శనం

మరో నిదర్శనం

ఎవరికైనా భూమా హామీ ఇస్తే దానిని నెరవేర్చే వారని అంటున్నారు. రాజకీయంగానే కాకుండా.. ప్రభుత్వ పనులు, క్లియరెన్సులలో కూడా ఆయన హామీ ఇస్తే చేయించేవారని అంటున్నారు. నంద్యాల ఆటో నగర్ అభివృద్ధి కూడా ఆయన ఇచ్చిన మాటకు మరో నిదర్శనం. యెర్రగుంట్ల - నంద్యాల రైల్వే లైన్ డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఆయన తనవంతు ప్రయత్నాలు చేశారు.

ప్రత్యేక స్థానం

ప్రత్యేక స్థానం

కర్నూలు రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా నాగి రెడ్డికి పట్టు ఉంది. క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలతో నేరుగా పరిచయం ఉన్న భూమా.. తన వారి కోసం, తన వర్గం కోసం ఎంతకైనా పోరాడుతారనే పేరు ఉంది. అందరికి అందుబాటులో ఉంటారని అంటారు. రైతు సమస్యల మీద ఆయన స్పందిస్తారని అంటున్నారు.

నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన భూమా నాగిరెడ్డి.. దొర్నిపాడు మండలం కొత్తపల్లెలో జన్మించారు. భూమా బాలిరెడ్డి- ఈశ్వరమ్మ దంపతులకు ఆయన రెండో సంతానం.

అందుకే ప్యాక్షన్ వైపు...

అందుకే ప్యాక్షన్ వైపు...

ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో నాగిరెడ్డిని చిన్నప్పటి నుంచి చెన్నైలో ఉంచి చదివించారు. తర్వాత బెంగళూరులో ఎంబీబీఎస్‌లో చేరిన భూమా.. తండ్రి హత్యతో స్వగ్రామానికి వచ్చేశారు. భూమా కుటుంబానికి ఫ్యాక్షన్‌కు దగ్గర సంబంధం ఉండటం, తమను నమ్ముకున్న వర్గాన్ని కాపాడుకోవటం కోసం తన తండ్రి పరంపరను అందుకున్నారు.

తండ్రి ఆస్తితో పాటు వర్గాన్ని కూడా పంచారని..

తండ్రి ఆస్తితో పాటు వర్గాన్ని కూడా పంచారని..

తండ్రి తమకు ఆస్తులతో పాటు వర్గాన్ని కూడా ఇచ్చారని భూమా చెబుతుంటారని అంటారు. వారసత్వంగా వచ్చిన ఫ్యాక్షన్‌ను నడిపిన ఆయన, తన సోదరుడి అకస్మిక మృతితో రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. సోదరుడి మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

నాటి రాష్ట్ర మంత్రి, మేనమామ ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె శోభా నాగిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి శోభా నాగిరెడ్డి ఇంట్లో అంగీకరించకున్నా, బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.

నాలుగు లక్షల ఓట్ల తేడాతో గెలిచారు

నాలుగు లక్షల ఓట్ల తేడాతో గెలిచారు

భూమా నాగిరెడ్డి మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. 1984లో రుద్రవరం సహకార సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 1986-90 వరకు ఆళ్లగడ్డ ఎంపీపీగా పని చేశారు. 1991లో ఆయన సోదరుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మృతి చెందటంతో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. 1996లో ప్రధాని పీవీపై టిడిపి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించటంతో దేశవ్యాప్తంగా భూమా పేరు అందరి నోటా నానింది. తర్వాత పీవీ నరసింహారావు నంద్యాల స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా టిడిపి తరపున బరిలోకి దిగిన భూమా సమీప ప్రత్యర్థి రంగయ్యనాయుడుపై దాదాపు 4,00,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు

గంగులపై గెలిచేందుకు కష్టపడ్డ భూమమా

గంగులపై గెలిచేందుకు కష్టపడ్డ భూమమా

1998లో జరిగిన లోకసభ ఎన్నికల్లో భూమా మళ్లీ బరిలోకి దిగారు. గంగుల ప్రతాప్ రెడ్డి. ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు భూమా చాలానే కష్టపడ్డారు. హోరాహోరీగా సాగిన పోరులో స్వల్ప ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించారు. ఈ ఫలితంతో భూమా తన తీరును మార్చుకున్నట్లుగా చెబుతారు. కేడర్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశంపై ఎక్కువ దృష్టి సారించారు. 1999లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బరిలోకి దిగిన భూమా దాదాపు 72వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

English summary
Bhuma Nagireddy and Sobha Nagi Reddy families were known for faction politics in the district, the marriage became big news those days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X