భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం!
నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డికి ఆదివారం నాడు ఉదయం గుండెపోటు వచ్చింది. ఆళ్లగడ్డ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డికి ఆదివారం నాడు ఉదయం తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆళ్లగడ్డ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల ఆసుపత్రికి తరలించారు.
భూమాకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తొలుత ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 108 నంద్యాలలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

టిడిపి తరఫున ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇటీవల చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యానికి గురవడంతో పార్టీ శ్రేణులు ఢీలాపడ్డాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. భూమాకు గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది.
వెంటిలెటర్‌పై చికిత్స
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. ఆయనకు వెంటిలెటర్ పైన చికిత్స అందిస్తున్నారు.
చికిత్సకు స్పందించడం లేదు?
భూమా చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఆయన కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైద్యులు దేవుడి పైన భారం వేశారని అంటున్నారు. చికిత్సను పర్యవేక్షించాలని మంత్రి కామినేని శ్రీనివాస రావుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన లోకేష్
కర్నూలు జిల్లా టిడిపి నేతలతో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ మాట్లాడారు. లోకేష్ హైదరాబాద్ నుంచి నంద్యాల బయలుదేరారు. భూమా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications