వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరి దగ్గర బాబు సాగిలా పడ్డారో!, ప్రతిజ్ఞ ఏమైంది కేసీఆర్?: ఓటుకు నోటుపై భూమన నిప్పులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అడ్డంగా గొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం ఓటుకు నోటు కేసు విచారణపై మాట్లాడారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడే ముద్దాయి అని దేశమంతా నమ్ముతోందని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ టేపు రికార్డులో ఉన్న గొంతు చంద్రబాబుదే అన్నది స్పష్టమైందని తెలిపారు. చంద్రబాబును అప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే, కానీ ఇలా తప్పుడు పనులు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్ల ప్రభుత్వాలు, చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు.

అడ్డంగా దొరికిన దొంగ..

అడ్డంగా దొరికిన దొంగ..

చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉండటం వల్లే ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోందని మండిపడ్డారు. సీబీఐ విచారణకు తెలంగాణ పోలీసులు చేపట్టిన విచారణ అడ్డుకారాదని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని, ఛార్జిషీటులో ఆయన పేరు ఇంతవరకూ ఎందుకు చేర్చలేదని భూమన ప్రశ్నించారు.

ఓటుకు నోటు తెరపైకి అందుకే, బాబు అలా, నేను ఇలా: కేసీఆర్-మోడీ డ్రామా అంటూ రేవంత్ ఓటుకు నోటు తెరపైకి అందుకే, బాబు అలా, నేను ఇలా: కేసీఆర్-మోడీ డ్రామా అంటూ రేవంత్

Recommended Video

Bjp Conspiracy Behind Cash For Vote Case
 బాబును విచారించరా?

బాబును విచారించరా?

ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు పేరు చేర్చకుంటే వారు కూడా చట్ట వ్యతిరేకులే భూమన అన్నారు. సామాన్యుడైనా, సీఎం అయినా చట్టాలు ఒకే తీరుగా ఉంటాయని, దీన్ని అందరూ సమ్మతిస్తారని చెప్పారు. మూడేళ్లు డుస్తున్నా కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేల ఓట్లు కొనేందుకు చూసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును విచారణకు పిలవకపోవడం దారుణమన్నారు.

అడ్డంగా దొరినికినా కేసులు పెట్టరా?

అడ్డంగా దొరినికినా కేసులు పెట్టరా?

ఓటుకు నోటు కేసుకు భయపడ్డ చంద్రబాబు.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ వద్ద సాగిలపడ్డారో.. లేక తెలంగాణలో కేసీఆర్ వద్ద సాగిలా పడ్డారోనని, అందుకే ఇన్నాళ్లు ఈ కేసులో నిర్లిప్తత కొనసాగుతుందని భూమన వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యేకి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు భయపడిపోయి..

చంద్రబాబు భయపడిపోయి..

ఓటుకు నోటు కేసు గురించి భయపడే.. చంద్రబాబు విజయవాడకు పారిపోయారని ఆరోపించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా చంద్రబాబు అకస్మాత్తుగా అమరావతికి మకాం మార్చడం వెనక అసలు ఉద్దేశం ఓటుకు నోటు కేసు భయమేనని భూమన కరుణాకర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ప్రతిజ్ఞ?.. బాబును అరెస్ట్ చేయాల్సిందే

కేసీఆర్ ప్రతిజ్ఞ?.. బాబును అరెస్ట్ చేయాల్సిందే

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడని సీఎం కేసీఆర్ ప్రతిజ్ఞ చేశారని.. చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని భూమన డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించాల్సి వస్తుందని అన్నారు. చంద్రబాబు రూ.50లక్షలు ఇప్పిస్తూ దొరికిపోయారని, ఫోన్లో మాట్లాడిన గొంతు కూడా చంద్రబాబుదేనని తేలిందని అన్నారు. వెంటనే చంద్రబాబు పేరును ఛార్జీ షీటులో నమోదు చేసి, అరెస్ట్ చేసి విచారించాలని భూమన డిమాండ్ చేశారు.

English summary
YSRCP leader Bhumana Karunakar Reddy on Wednesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu in vote for cash case issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X