వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైసాకు ఉపయోగపడని మంత్రులు: చంద్రబాబుకు భూమన హెచ్చరిక

ఏపీ కేబినెట్లో జగన్ తీరును ఖండిస్తూ తీర్మానం చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. చంద్రబాబు నాయుడే ఓ మానసిక రోగి అని వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ కేబినెట్లో జగన్ తీరును ఖండిస్తూ తీర్మానం చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. చంద్రబాబు నాయుడే ఓ మానసిక రోగి అని వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

కొత్త మలుపు: 'జగన్ చొక్కా పట్టుకున్న కలెక్టర్, ఆధారాలతో కోర్టుకు'కొత్త మలుపు: 'జగన్ చొక్కా పట్టుకున్న కలెక్టర్, ఆధారాలతో కోర్టుకు'

తమ నాయకుడి పైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పైసాకు కూడా ఉపయోగపడని మంత్రుల మాటలకు భయపడేది లేదని చెప్పారు. జగన్‌ను చూస్తే చంద్రబాబు అండ్ కోకు అంత భయం ఎందుకని నిలదీశారు.

bhumana karunakar reddy

దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో నిజాలు నిగ్గు తేల్చడానికే జగన్ నందిగామ వెళ్లారని చెప్పారు. అయితే పక్కన ఉన్న చంద్రబాబు మాత్రం బాధితులను పరామర్శించడానికి వెళ్లలేదని మండిపడ్డారు.

గతంలో అధికారుల గురించి నీచంగా మాట్లాడింది చంద్రబాబే అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించింది వాస్తవం కాదా అన్నారు. చంద్రబాబు తిడితే వాదాక్షరాలు, జగన్ చట్టం గురించి మాట్లాడితే బూతులు అవుతాయా అన్నారు.

జగన్ పలుచన అయ్యారు: వీడియో చూసిన బాబు, నా వద్దకు రావద్దని హెచ్చరికజగన్ పలుచన అయ్యారు: వీడియో చూసిన బాబు, నా వద్దకు రావద్దని హెచ్చరిక

వరల్డ్ బ్యాంకుకు తొత్తుగా చంద్రబాబు మనసులో మాట పుస్తకం రాశారని ఆరోపించారు. ఆ పుస్తకంలో విద్యుత్ రంగంలో 60 శాతం, రెవెన్యూ రంగంలో 64 శాతం, పోలీస్ శాఖలో 62 శాతం మంది ఉద్యోగులు అవినీతిపరులు అని, ఉద్యోగులకు జీతాలు దండుగ అని రాసుకున్నారని చెప్పారు.

అసెంబ్లీలో ప్రజల వాయిస్ అయిన ప్రతిపక్షం గొంతు వినాలని హితవు పలికారు. సభలో బెంచీలు, కుర్చీలతో ప్రయోజనం లేదన్నారు. సభను ఉన్నత ప్రమాణాలతో నడపాలన్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను అడ్డుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పాలనలో స్వచ్ఛత ఉండేలా చూసుకోవాలన్నారు.

English summary
YSR Congess Party MLA Bhumana Karunakar Reddy on Friday warned TDP chief and Ministers for targetting YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X