విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖకు మరిన్ని పెద్ద కంపెనీలు, లక్ష ఐటీ ఉద్యోగాలు: బాబు, లోకేష్‌‌ల ఆకాంక్ష!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: కాన్డ్యూయెంట్ మంచి కంపెనీ అని, రియల్ టైంలో ఇక్కడ నుంచి అమెరికాకు సేవలు అందించేలా మన ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. గురువారం విశాఖలో పలు కంపెనీలను ఆయన ప్రారంభించారు.

Recommended Video

ప్రతిపక్షాలను ఏకి పారేసిన లోకేష్..!

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విశాఖలో 25 వేల నుంచి 30 వేల మంది పర్యాటకులు ఉండేలా హోటళ్ల నిర్మాణం జరిగితే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని సీఎం చెప్పారు.

Big Companies should come, One Laksh IT Jobs by 2019, says Babu and Lokesh

అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఐటీ రంగంలో పెద్ద కంపెనీలు ఏపీకి వస్తున్నాయని, కాన్డ్యూయెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పెద్ద కంపెనీలని తెలిపారు.

కాన్డ్యూయెంట్ కంపెనీలో 92 వేల మంది పనిచేస్తున్నారని, పెద్ద నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని, ఇలాంటి పెద్ద కంపెనీలు విశాఖకు మరిన్ని రావాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.

English summary
AP CM Chandrababu Naidu and his Son who is a IT Minister for the State Nara Lokesh told that they are expecting Big Companies to Visakhapatnam and by 2019 state should achieve One Lakh IT Jobs. After inaguaration of the Companies Conduent, Franklin Templeton, other two more companies.. here in Visakhapatnam on Thursday, While speaking CM Chandrababu and Minister Lokesh told that they are very big and good companies. Visakhapatnam has lot of scope to give tough fight with other big cities. Babu opened 4 IT companies in Vizag today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X