ఏపీ సచివాలయంలో తొలి ఏసీబీ దాడి, రూ.50వేలు లంచం తీసుకుంటూ చిక్కాడు
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తొలిసారి ఓ అధికారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ)కు చిక్కాడు. వెలగపూడి సచివాలయంలో తొలి ఏసీబీ ట్రాప్ శుక్రవారం నాడు జరిగింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తొలిసారి ఓ అధికారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ)కు చిక్కాడు. వెలగపూడి సచివాలయంలో తొలి ఏసీబీ ట్రాప్ శుక్రవారం నాడు జరిగింది. హోంశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
సదరు అధికారి పైన కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఉద్యోగులు వెలగపూడి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే సచివాలయంలో పరిపాలనా కొనసాగుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నుంచి సచివాలయం నుంచే విధులు ప్రారంభిస్తారు. ఈ తరుణంలో ఏసీబీకి అధికారి చిక్కడం గమనార్హం.
శ్రీనాథ్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ఏపీలో ప్రయివేటు సెక్యూరిటీ సంస్థ ఏర్పాటు కోసం శ్రీనాథ్ కొందరి నుంచి రూ.50వేల మొత్తం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని అతను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications