వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.15వేలు కట్టండి, అవసరంలేదు: బాబ్లీ కేసులో బాబుకు భారీ ఊరట, 'అదేం క్రూరమైన నేరం కాదు'

|
Google Oneindia TeluguNews

అమరావతి: బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం భారీ ఊరట లభించింది. ముఖ్యమంత్రి తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ కోర్టు ఆమోదించింది.

<strong>భారతిపై కేసులు ఉండేవా, మావి సరే, మీ ఎన్నికల మాటేమిటి: వైవీ, వంగవీటి రాధా ఇష్యూపై..</strong>భారతిపై కేసులు ఉండేవా, మావి సరే, మీ ఎన్నికల మాటేమిటి: వైవీ, వంగవీటి రాధా ఇష్యూపై..

చంద్రబాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన మిగతా వారు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఛార్జెస్ క్లెయిమ్ చేసే వరకు చంద్రబాబుకు శాశ్వతంగా వ్యక్తిగత హాజరు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. చంద్రబాబు తరఫు లాయర్లు వ్యక్తిగత మినహాయింపు నుంచి మినహాయింపు కోరారు.

కనీసం వారెంట్ జారీ చేయలేదు

కనీసం వారెంట్ జారీ చేయలేదు

చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి కావడంతో వచ్చే రెండు నెలలు విచారణకు హాజరు కావడం సాధ్యపడదని ఆయన తరఫు న్యాయవాదులు ధర్మాబాద్ కోర్టుకు తెలిపారు. కనీసం తమకు వారెంట్ జారీ చేయలేదని పేర్కొన్నారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ మల్హోత్రా వాదనలు వినిపించారు.

Recommended Video

ఆంధ్రప్రదేశ్ ఈ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం : చంద్రబాబు
రూ.15వేలు చెల్లించాలి

రూ.15వేలు చెల్లించాలి

దీనిపై మరో న్యాయవాది సుబ్బారావు మాట్లాడుతూ... దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు వాదనలు జరిగాయని చెప్పారు. చంద్రబాబు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను కోర్టు అనుమతించిందని చెప్పారు. అనుమతిస్తూనే రూ.15వేల ధర్మాబాద్ లీగల్ సెల్ అథారిటీకి అక్టోబర్ 15వ తేదీలోగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

15న హాజరుకావాల్సిన అవసరం లేదు

15న హాజరుకావాల్సిన అవసరం లేదు

ఈ నెల 15వ తేదీన కోర్టు తదుపరి విచారణ జరగనుందని, అయితే అప్పుడే కాదు, కోర్టు ఛార్జెస్ క్లెయిమ్ చేసే వరకు చంద్రబాబు కోర్టు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తెలిపిందని న్యాయవాది సుబ్బారావు తెలిపారు. తదుపరి డిశ్చార్జ్ అప్లికేషన్ దాఖలు చేయవచ్చునని, దీంతో ఆయన ముద్దాయి కాదని కోర్టు విడుదల చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. చంద్రబాబు మినహా మిగతా వారు అక్టోబర్ 15న హాజరు కావాల్సి ఉందని చెప్పారు.

అలా చేయకుండానే నాన్ బెయిబుల్ వారెంట్ సరికాదు

అలా చేయకుండానే నాన్ బెయిబుల్ వారెంట్ సరికాదు

కోర్టు ఇప్పటి వరకు సమన్లు లేదా బెయిలబుల్ వారెంట్లు లేదా నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ జరగలేదని న్యాయవాది చెప్పారు. తాము మీడియాలో తెలుసుకొని కోర్టుకు హాజరయ్యామని చెప్పామని అన్నారు. రికార్డ్ పరిశీలించిన అనంతరం కోర్టు కూడా ఏ స్టేజీలోను సమన్లు జారీ చేయలేదని, బెయిలబుల్ వారెంట్ ఇవ్వలేదని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం సమంజసం కాదన్నారు.

ఇదేం క్రూరమైన నేరం కాదు

ఇదేం క్రూరమైన నేరం కాదు

ఇదేం అత్యంత క్రూరమైన నేరం కాదని, సామాన్యమైన నేరమేనని లాయర్ చెప్పారు. తొలుత చంద్రబాబు ముఖ్యమంత్రిగా నిర్వర్తించాల్సిన విధులు చాలా ఉన్నాయని, ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని న్యాయస్థానం మినహాయింపు ఇచ్చిందన్నారు. తాము మూడు అప్లికేషన్లు వేశామని, నాన్ బెయిలబుల్ వారెంట్ పైన రీకాల్ అప్లికేషన్ ఒకటి, హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రెండోది, శాశ్వతంగా హాజరు మినహాయింపు కోరుతూ కూడా దరఖాస్తు చేశామన్నారు.

English summary
Big relief to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu in Babli project case on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X