వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి లో బిగ్‌బాస్ కౌశ‌ల్ : ఎన్నిక‌ల బ‌రిలోకా..ప్ర‌చారానికా : చ‌ంద్ర‌బాబు తో భేటీ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Koushal Manda Joined In TDP ! | Oneindia Telugu

బిగ్‌బాస్ -2 విజేత కౌశ‌ల్ రాజ‌కీయ రంగ ప్రవేశం చేసారు. ఆయ‌న టిడిపి అధినేత చంద్ర‌బాబు తో స‌మావేశ‌మ‌య్యారు. రానున్న ఎన్నిక‌ల్లో టిడిపి నుండి పోటీ చేయ‌టానికి ఆస‌క్తిగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, టిడిపి కి మ‌ద్ద తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తార‌ని కొంద‌రు నేత‌లు చెబుతున్నారు. కౌశ‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఎక్క‌డి నుండి టిడిపి బ‌రిలోకి దింపుతుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది..

ఎన్నిక‌ల త‌రుముకొస్తున్నాయ్..! ఇంకా తేల‌ని రాధా రాజ‌కీయ భ‌విత‌..!!ఎన్నిక‌ల త‌రుముకొస్తున్నాయ్..! ఇంకా తేల‌ని రాధా రాజ‌కీయ భ‌విత‌..!!

చంద్ర‌బాబు తో కౌశ‌ల్..
విశాఖ..అన‌కాప‌ల్లి అభ్యర్ధుల ఎంపిక పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు బిగ్ బాస్ కౌశ‌ల్ ను ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు తీసుకొచ్చారు. కౌశ‌ల్ సీయం తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి ఆస‌క్తి ఉన్న విష‌యం పైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. మంత్రి గంటా శ్రీనివాస రావు మాత్రం కౌశ‌ల్ ను వ‌చ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుండి టిడిపి అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దించాల‌ని..అది పార్టీకి మేలు చేస్తుంద‌ని సీయం కు వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. కౌశ‌ల్ సైతం టిడిపి తో క‌లిసి ప‌ని చేయ‌టానికి సుముఖ‌త వ్య‌క్తం చేసారు. ఎన్నిక‌ల్లో టిడిపికి అనుకూలంగా ప్ర‌చారం చేస్తార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే, గంటా చేసిన ప్రతి పాద‌న‌ల పైనా సీయం నిశితంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

Bigboss Koushal in TDP : He may contest in up coming elections

అన‌కాప‌ల్లి ఎంపీ సీటు పైనే..
గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస రావు కొద్ది రోజుల క్రితం టిడిపిని వీడి వైసిపి లో చేరారు. దీంతో..ఇప్పుడు టిడిపి నుండి అన‌కాప‌ల్లి ఎంపీ అభ్య‌ర్ది ఎవ‌ర‌నే దాని పై ఇంకా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఇక‌, ఇదే స‌మ‌యంలో మంత్రి గంటా శ్రీనివాస రావు తెర పైకి కౌశ‌ల్ పేరు ప్ర‌తిపాదించారు. ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉన్న కౌశ‌ల్ కు అక్క‌డ ఎంపీ సీటు ఇవ్వ‌టం ద్వారా సామాజిక స‌మీక‌ర‌ణాల్లోనూ బ్యాలెన్స్ అవుతుంద‌ని ముఖ్య‌మంత్రి కి వివ‌రించిన ట్లు స‌మాచారం. అయితే, పార్టీలో విశాక జిల్లాకు చెందిన కొంద‌రుఏ నేత‌లు చేరేందుకు ముందుకు వ‌స్తున్నారు. అన్ని స‌మీక‌ర‌నాలు..స‌మ‌ర్ధ‌త ప‌రిశీలించిన త‌రువాత కౌశ‌ల్ కు సీటు కేటాయింపు పై నిర్ణ‌యం తీసుకుందామ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే, కౌశ‌ల్ మాత్రం కొద్ది రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్ల‌డించారు.

English summary
Bigboss - 2 Winner Koushal met TDP Chief Chandra Babau and announce his support for party. Minister Ganta proposed Anakapalli MP seat for Kaushal. Cm to be take decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X