విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణం తీసిన బైక్‌ రేసింగ్:పరువు తీసిన సోషల్ మీడియా ఛాటింగ్...

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:పిల్లల పట్ల అతి ప్రేమ పలు సందర్భాల్లో ఆ పిల్లల ప్రాణాలకే ముప్పు తెస్తుండగా...మరి కొన్ని సందర్భాల్లో ఆ తల్లిదండ్రుల పరువు, యువకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. రాష్ట్రంలో రెండు చోట్ల శనివారం చోటుచేసుకున్న మూడు ఘటనలు ఇందుకు నిదర్శనం గా నిలుస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో బైక్‌ రేసింగ్‌కు వెళ్ళి వస్తున్న నలుగురు మైనర్లు రోడ్డు ప్రమాదానికి గురికాగా...వీరిలో ఒక యువకుడు మృతి చెందగా...మరొకరు కోమాలోకి వెళ్ళారు... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఉదంతంలో ఒక మైనర్ బాలుడు...మైనర్ బాలిక మధ్య సోషల్ మీడియాలో ఛాటింగ్ ఫలితంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిద్దరూ కలసి జీవించడం కోసం ఆ బాలికను ఇంటికెళ్లి మరీ తీసుకొచ్చేశాడు ఆ బాలుడు. ఆ తరువాత వీరిద్దరి గురించి తెలిసిన తల్లిదండ్రులు ఛాటింగ్ లో వీరిద్దరూ చెప్పుకున్న అబద్దాలు ఈ విపరీత పరిణామానికి దారితీసాయని తెలిసి దిగ్భ్రాంతి చెందారు. వివరాల్లోకి వెళితే...

 Bike racing took the lives...Chatting damaged Parental Dignity

ఘటన 1: చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన నలుగురు యువకులు శుక్రవారం రాత్రి రెండు బైక్‌లపై ముళబాగళ్‌ బైపాస్‌ రోడ్డులో రేసింగ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాయలూరు వద్ద ముందు వెళుతున్న వీరు ట్రాకర్ట్‌ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వి.కోటకు చెందిన ఫైజ్‌(18) అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు యువకులు గాయపడ్డారు.

ప్రమాదానికి గురైన వీరిని గమనించిన స్థానికులు గాయపడిన యువకులను ఆస్పత్రికి తరలించారు. వారిలో షారూ అనే యువకుడు కోమాలోకి వెళ్లాడు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కాలు విరిగిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైజ్‌ మృతదేహాన్ని వి.కోటకు తరలించారు. అయితే
ఇటీవల వి.కోట పరిసరాలకు చెందిన కొందరు యువకులు బైక్‌ రేసింగ్‌ల కోసమే ప్రత్యేకంగా ఆర్‌ఎక్స్‌ యమహా వాహనాలను తయారు చేయించుకొని ముళబాగల్‌ బైపాస్‌లో రేసింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో రేసింగ్‌ సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే కొందరు యువకులు మృత్యువు పాలు కాగా పలువురు గాయాలపాలైనట్లు తెలిసింది. యువకులు రేసింగ్‌కు పాల్పడుతున్న విషయం తెలిసికూడా తల్లిదండ్రులు పిల్లలను వారించకుండా బైక్‌లు కొనిస్తుండడం వారి ప్రాణాల మీదకు తెస్తోందని స్థానికులు అంటున్నారు.

ఘటన 2: ఇక ఒక మైనర్ బాలుడు...మైనర్ బాలిక మధ్య సోషల్ మీడియా ఛాటింగ్ ఇరువురి తల్లిదండ్రుల పరువు పోవడానికి కారణమైన ఉదంతమిది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం బాలిక...గుంటూరు జిల్లా గాదేపల్లి బాలుడు మధ్య ఫేస్‌బుక్ చాటింగ్‌తో వ్యవహారం చివరకు పోలీసుల వద్దకు చేరింది. గుంటూరు జిల్లా కారంపూడి మండలం గాదేపల్లికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఐటీఐ మానేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న ఇతనికి అమలాపురంలో 9తరగతి చదువుతున్న బాలిక పరిచయమైంది.

ఆ పరిచయంతోనే వాట్సాప్, ఫేస్‌బుక్ చాటింగ్ చేసుకున్న వీరిద్దరూ తమ నేపథ్యాల గురించి తమ గురించి అన్నీ అబద్దాలు చెప్పుకున్నారు. బాలుడేమో తాను ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాని చెప్పగా...ఆ బాలికేమో తాను మెడిసిన్ చదువుతున్నానని బిల్డప్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇక తామిద్దరూ కలసి జీవించాలని భావించిన బాలుడు అమలాపురంకు వెళ్లి ఆ బాలికను తీసుకొని గుంటూరుకు వచ్చాడు.

ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి తీగలాడంతో అసలు విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. అలా అమలాపురం పోలీసులు ఇచ్చిన సమాచారంతో గుంటూరు పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు యువకుడ్ని విచారిస్తున్నారు.

ఘటన 3: భార్యతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడని ఓ యువకుడిని ఆమె భర్త దారుణంగా హత్య చేసిన ఘటన విజయవాడలో జరిగింది. గన్నవరంకు చెందిన రామాంజనేయ శర్మ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ వివాహితతో వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నాడు. ఇది గమనించిన ఆమె భర్త వీరిపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో శర్మ సంగతి తేల్చాలని తన ముగ్గురి స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్‌తో రామాంజనేయ శర్మ పై దాడి చేసి ముగ్గురు మిత్రులతో కలసి అతికిరాతకంగా హతమార్చారు.

అయితే ఉన్నట్టుండి తన భర్త కనపడకపోవడంతో శర్మ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే చేధించి... మర్డర్ మిస్టరీ చేధించి హంతకులను అరెస్ట్ చేశారు. అయితే వివాహితతో శర్మకు ఎలాంటి వివాహేతరం సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలింది. అనుమానంతోనే రామాంజనేయ శర్మను వివాహిత భర్త చంపాడని పోలీసులు చెబుతున్నారు.

English summary
Vijayawada:Parents love over children is became threat to their lives in many cases ... and in some cases the parents prestige and the lives of young people are lost. The three recent incidents that took place on Saturday in two parts of the state are evidences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X