విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును చూసి ఆశ్చర్యపోయా, అడిగితే సరేనని చెప్పా: బిల్ గేట్స్ ప్రశంసలు

వ్యవసాయ రంగంలో భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడనని, వ్యవసాయ రంగంలో కలిసి ముందుకు సాగుదామని చెప్పారని, తాను ఆయన ప్రతిపాదనను అంగీకరించానని బిల్ గేట్స్ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Bill Gates Attended AP Agritech Summit | Oneindia Telugu

విశాఖపట్నం: వ్యవసాయ రంగంలో భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడనని, వ్యవసాయ రంగంలో కలిసి ముందుకు సాగుదామని చెప్పారని, తాను ఆయన ప్రతిపాదనను అంగీకరించానని బిల్ గేట్స్ చెప్పారు.

కాక్ టైల్‌ పార్టీలో కలవమన్నారు, 10 ని.లు అని 40 ని.లు మాట్లాడారు: బిల్ గేట్స్‌పై బాబుకాక్ టైల్‌ పార్టీలో కలవమన్నారు, 10 ని.లు అని 40 ని.లు మాట్లాడారు: బిల్ గేట్స్‌పై బాబు

ఏపీలోని విశాఖపట్నంలో అగ్రి టెక్ సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యవసాయ ప్రదర్శనలు తిలకించారు. అనంతరం బిల్ గేట్స్ మాట్లాడారు.

నూతన ఆవిష్కరణలు సంతోషకరం

నూతన ఆవిష్కరణలు సంతోషకరం

వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు రావడం సంతోషకరమని బిల్ గేట్స్ అన్నారు. ఏపీ భవిష్యత్తు రైతులపై ఆధారపడి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. వ్యవసాయ రంగంలో మరింత సాంకేతికతను వినియోగించాలన్నారు. భారత ఆర్థిక వృద్ధి వ్యవసాయంపై ఆధారపడి ఉందన్నారు. ఇక్కడ చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ అన్నారు.

వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయాలి

వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయాలి

వ్యవసాయాన్ని వ్యాపారంగా చేసినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. భారత దేశంలో సాంకేతికత, నూతన ఆవిష్కరణలు రైతులకు చేరువ కావాలన్నారు. వ్యవసాయరంగంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఏపీ ముందుకు వచ్చిందని చెప్పారు.

ఏపీతో కలిసి పని చేస్తాం

ఏపీతో కలిసి పని చేస్తాం

వ్యవసాయ రంగంలో ఉత్పాదక పెంపు, మార్కెట్ అనుసంధానంపై ఏపీతో కలిసి పని చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదక పెంపుకు మరిన్ని పరిశోధనలు అవసరమని చెప్పారు. పశుగణాభివృద్ధి, డెయిరీ రంగంలో సాంకేతిక అవసరమన్నారు. ఇండోనేషియాలో శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు చేరువయ్యాయని చెప్పారు.

మెగా సీడ్ పార్కుల వల్ల ప్రయోజనం

మెగా సీడ్ పార్కుల వల్ల ప్రయోజనం

మెగా సీడ్ పార్కుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. విత్తన ఉత్పత్తికి ఏపీ కేంద్రంగా మారనుందన్నారు. రైతులకు భూసార పరీక్ష పత్రాలు చేరాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల సమాచారం చిన్న రైతులకు సరిగా అందడం లేదన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పును ప్రోత్సహించాలన్నారు.

బాబు విజన్ చూసి ఆశ్చర్యపోయా

బాబు విజన్ చూసి ఆశ్చర్యపోయా

చంద్రబాబు విజన్ చూసి ఆశ్చర్యపోయానని బిల్ గేట్స్ అన్నారు. వ్యవసాయ రంగంలో ఇక ఏపీ ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. రైతులకు సాయపడితే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. కాగా, అగ్రిటెక్ మూడో రోజు సందర్భంగా మిలిందా గేట్స్ సంస్థతో ఏపీ శాటిలైట్ భూసార పరీక్షలపై ఏపీ ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది.

English summary
microsoft founder Bill Gates attended Andhra Pradesh agritech summit in Vishakhapatnam on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X