వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ,తెలంగాణా రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ భయం: ప్రభుత్వాల ముందు జాగ్రత్త,అధికారులు అలెర్ట్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది . బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . అసలే కరోనా వైరస్, కరోనా కొత్త స్ట్రెయిన్ లతో వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్తగా బర్డ్ ఫ్లూ భయం మొదలైంది. బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే కేరళ రాష్ట్రం రాష్ట్ర విపత్తు గా ప్రకటించి అధికారులను అప్రమత్తం చేస్తే, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ,హర్యానా, మధ్యప్రదేశ్ వంటి మరో నాలుగు రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

బర్డ్ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు.. అలెర్ట్ అయిన తెలుగు రాష్ట్రాలు

బర్డ్ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు.. అలెర్ట్ అయిన తెలుగు రాష్ట్రాలు

బర్డ్ ఫ్లూ విషయంలో ముందుగా మేల్కొంటే పెనుప్రమాదం నివారించవచ్చని బర్డ్ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు రాకుండా కాపాదవచ్చని ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధికారులు ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న కారణంగా అది ఏపీ ,తెలంగాణ రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా కోళ్ళు, బాతులు అనారోగ్యంతో మృతి చెందుతున్న ప్రాంతాలు ఉంటే జాగ్రత్తగా పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

బర్డ్ ఫ్లూతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మాంసం విక్రయాల నిషేధం

బర్డ్ ఫ్లూతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మాంసం విక్రయాల నిషేధం

బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల నుండి మనుషులకు ఇప్పటి వరకూ వ్యాప్తి చెందిన దాఖలాలు లేవు. ముందు జాగ్రత్త చర్యగా బర్డ్ ఫ్లూతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మాంసం విక్రయాలను నిషేధించారు. కోళ్లు, బాతులు, చేపల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడంతో జమ్ముకశ్మీర్ అలర్ట్ అయింది. వెంటనే వలస పక్షులు శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపింది. అటు తమిళనాడు కూడా కేరళ బోర్డర్ లో ఉన్న పక్షుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపింది. ఇదే సమయంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా అప్రమత్తమైంది.

అన్ని రాష్ట్రాలలోనూ బర్డ్ ఫ్లూ ఆందోళన ..

అన్ని రాష్ట్రాలలోనూ బర్డ్ ఫ్లూ ఆందోళన ..

బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్ల ద్వారా మనుషులకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ నుండి కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పక్షుల నుండి మనుషులకు బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ పై అన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక సమీప రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఉన్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు పౌల్ట్రీ యజమానులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

English summary
Bird flu scares Telugu states .Bird flu, is now creating tension in the AP and telangana . The governments take precautions alerted the officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X