వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో బర్డ్ ఫ్లూ భయం .. విశాఖలో మృతిచెందిన కాకులు .. బాగా తగ్గుతున్న చికెన్ ధరలు

|
Google Oneindia TeluguNews

కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇదే సమయంలో మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ పరిశ్రమకు శరాఘాతంగా మారుతోంది. ఇప్పటికి ఏడు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బర్డ్ ఫ్లూ భయం వేధిస్తోంది.

ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా బర్డ్ ఫ్లూ వల్లే అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

 విశాఖపట్నంలో ఆరు కాకులు, ఒక పిచ్చుక మృతి

విశాఖపట్నంలో ఆరు కాకులు, ఒక పిచ్చుక మృతి

తాజాగా విశాఖపట్నంలో ఆరు కాకులు, ఒక పిచ్చుక మృతిచెందడంతో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోళ్ళు , పక్షులు, కాకులు మృత్యు వాత పడుతుంటే ఈ ఘటన స్థానికులకు ఆందోళన కలిగిస్తుంది .
విశాఖ నగరంలోని కొత్తపాలెం పరిధి సాయి నగర్ , భగత్ సింగ్ నగర్ , గణేష్ సాయి నగర్ లలో 3 కాకులు , దేవరాపల్లిలో మరో 3 కాకులు , ఒక పిచ్చుక మృతి చెందాయి .

బర్డ్ ఫ్లూ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆందోళన నెలకొంది . దీంతో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక సంక్రాంతి పండుగ వస్తున్న సమయంలో తాజా పరిస్థితి పౌల్ట్రీ పరిశ్రమకు తీరని నష్టం చేసింది .

 గణనీయంగా పడిపోయిన చికెన్ ధరలు

గణనీయంగా పడిపోయిన చికెన్ ధరలు

గత పది రోజులుగా చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి . మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ పక్షి చనిపోయినా బర్డ్ ఫ్లూ నా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది . మొన్నటికి మొన్న గుంటూరులోనూ కాకులు మృతి చెందటం కలకలం రేపిన విషయం తెలిసిందే . గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలం గుదిబండివారిపాలెంలో కాకులు మృతిచెందడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గుదిబండి వారి పాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆరు కాకులు చచ్చిపోవడంతో, కాకుల మృతి బర్డ్ ఫ్లూ కారణంగానే అంటూ ప్రచారం కొనసాగుతుంది.

 పౌల్ట్రీ వర్గాలకు బర్డ్ ఫ్లూ షాక్... వ్యాపారంపై ఆందోళనలో పౌల్ట్రీ యాజమాన్యం

పౌల్ట్రీ వర్గాలకు బర్డ్ ఫ్లూ షాక్... వ్యాపారంపై ఆందోళనలో పౌల్ట్రీ యాజమాన్యం


మొన్నటి వరకు కరోనా మహమ్మారి కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది . ఇప్పుడు మరో మారు పౌల్ట్రీ వర్గాలకు బర్డ్ ఫ్లూ షాక్ ఇచ్చింది . దీంతో ఈ ఏడాది వ్యాపారంపై పౌల్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది . ఒకపక్క కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని అందరూ సంతోషిస్తున్న సమయంలో ఇలా బర్డ్ ఫ్లూ వైరస్ గత పదిరోజులుగా ఊపిరాడనీకుండా చేసింది . గత పదిరోజుల్లో రాజస్థాన్ , హర్యానా , హిమాచల్ ప్రదేశ్ , మధ్య ప్రదేశ్ , కేరళ , కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించింది .ఏపీలోనూ బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది .

అధికారులు అలెర్ట్ .. పక్షులకు పరీక్షలు , వలస పక్షులపై ఆరా

అధికారులు అలెర్ట్ .. పక్షులకు పరీక్షలు , వలస పక్షులపై ఆరా

ఇప్పటికే అప్రమత్తం అయిన ప్రభుత్వం అధికారులకు తగిన ఆదేశాలు జారీ చెయ్యగా అధికారులు ఎక్కడ ఎలాంటి పక్షుల మృతి ఘటనా జరిగినా వెంటనే శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపిస్తున్నారు. పౌల్ట్రీ యజమానులను అలెర్ట్ చేస్తున్నారు. వలస పక్షులపై ఆరా తీసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వదంతులు నమ్మొద్దని చెప్తున్నారు .

English summary
Six crows and a sparrow have died in Visakhapatnam recently, sparking a bird flu outbreak. The incident is of concern to locals as hens, birds and crows are already dying in several states. Three crows died in Sai Nagar, Bhagat Singh Nagar and Ganesh Sai Nagar in Kottapalam area of ​​Visakhapatnam city, another three crows and a sparrow in Devarapally. The state of Andhra Pradesh is also worried about bird flu. This led to a decline in chicken prices. The latest situation is that the poultry industry will suffer immense damage during the coming Sankranthi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X