విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆప‌రేష‌న్ ఏపి మొద‌లైన‌ట్లేనా :నూత‌న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం:ఒకే వేదికపై జ‌గ‌న్‌..చంద్రబాబు...!

|
Google Oneindia TeluguNews

ఏపీ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రాజ్‌భ‌వ‌న్‌లో ఈ ప్ర‌మాణ స్వీకారం జ‌రిగింది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలి సారి ఇద్ద‌రూ క‌లిసి పాల్గొన్న తొలి కార్య‌క్ర‌మం ఇదే. ఇక‌..2024 వ‌ర‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించాల్సి ఉన్నా..ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం ద్వారా కేంద్రం త‌మ ఆలోచ‌న‌లు ఏంటో చెప్ప‌క‌నే చెప్పింది. దీని ద్వారా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాజ‌కీయ వ్యూహాల్లో భాగంగా..ఇక ఆప‌రేష‌న్ ఏపి మొద‌లుపెట్టిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

నేడే ఏపీ గవర్నర్ హరి చందన్ ప్రమాణ స్వీకారం .. సర్వం సిద్ధంనేడే ఏపీ గవర్నర్ హరి చందన్ ప్రమాణ స్వీకారం .. సర్వం సిద్ధం

Recommended Video

కాపునాడు ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
బిబి హ‌రిచంద‌న్ ప్ర‌మాణ స్వీకారం..

బిబి హ‌రిచంద‌న్ ప్ర‌మాణ స్వీకారం..

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపి తొలి గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసారు. కేంద్ర ప్ర‌భుత్వ సిఫార్సు మేర‌కు రాష్ట్రప‌తి ఆయ‌న్ను ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి హోదాలో విజ‌య సాయిరెడ్డి భువ‌నేశ్వ‌ర్ వెళ్లి ఆయ‌న్ను అభినందించారు. ఏపీకి వ‌చ్చిన ఆయ‌న తొలుత తిరుమ‌ల‌లో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకుని..ఆ త‌రువాత విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి స్వాగ‌తం ప‌లికారు. ఇక‌, ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్ ప్ర‌వీణ్ కుమార్ కొత్త గ‌వ‌ర్న‌ర్‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఏపి ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాద్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆయ‌న పాల్గొన్న కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు సైతం హాజ‌రు కావ‌టం ఇదే తొలి సారి. గ‌వ‌ర్న‌ర్ ప‌క్క‌నే ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో జ‌గ‌న్ ఆశీసులు కాగా..చంద్ర‌బాబు అతిధుల మ‌ధ్య కూర్చొన్నారు. ఆ త‌రువాత ఏర్పాటు చేసిన తేనేటి విందులో ఇద్ద‌రు నేత‌లు పాల్గొన్నారు.

ఒడిశా స్వ‌రాష్ట్రం..జ‌న‌సంఘ్ కార్య‌క‌ర్త‌గా

ఒడిశా స్వ‌రాష్ట్రం..జ‌న‌సంఘ్ కార్య‌క‌ర్త‌గా

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ ఒడిశా రాష్ట్రంకు చెందిన వారు. ఆయ‌న 1934 ఆగ‌స్టు 3వ తేదీన జ‌న్మించారు. న్యాయ‌వాద వృత్తిలో ప‌ట్ట‌భ‌ద్రుడైన బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ మంచి ర‌చ‌యిత. ఆయ‌న అనేక ర‌చ‌న‌లు చేసారు. ఇక‌, యువ‌కుడిగా ఉన్న స‌మయం నుండి జ‌న‌సంఘ్..ఆర్‌య‌స్‌య‌స్‌ కార్య‌క‌ర్త‌గా ఉన్నారు. ఆ త‌రు వాత బీజేపీలో ప‌ని చేసారు. అక్క‌డ నుండి కొన్ని కార‌ణాల వ‌ల‌న బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌న‌తాద‌ళ్‌లో కీల‌క పాత్ర పోషించా రు. కొద్ది కాలాని కి తిరిగి బీజేపీలో చేరారు. ఆయ‌న ఒడిశాలో అయిదు సార్లు ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించారు. ఆ రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి గానూ ప్రాతినిధ్యం వ‌హించారు. 1980 నుండి 1988 వ‌ర‌కు ఒడిశా బీజేపీ రాష్ట్ర శాఖ‌కు బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ ఉపాధ్య‌క్షుడిగా..అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. ఆ త‌రువాత బీజేపీ జాతీయ వ్య‌వ‌హారాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దశ్ తొలి గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసారు.

ఇక ఏపీ మీద ఫోక‌స్ మొద‌లైందా..

ఇక ఏపీ మీద ఫోక‌స్ మొద‌లైందా..

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ-తెలంగాణ‌కు 2024 వ‌ర‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఉండాలి. కానీ, ఏపి ప్ర‌భుత్వం నూత‌న రాజ‌ధాని ఏర్పాటు చేసుకోవ‌టం.. తెలంగాణ ప్ర‌భుత్వంతో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటున్న వేళ‌..కేంద్రం ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించింది. రాజ‌కీయంగా ఈ అయిదేళ్ల కాలంలో ఎలాగైనా ద‌క్షిణాదిన త‌మ స‌త్తా చాటాలాని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా..ఏపి-తెలంగాణ మీద ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఏపీలో సైతం రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్న ప‌రిస్థితుల్లో కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం జ‌రిగింది. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల పైన కొత్త గ‌వ‌ర్న‌ర్ నిశితంగా దృష్టి సారించే అవ‌కాశం ఉంది. దీని ద్వారా అస‌వ‌రానికి అనుగుణంగా కేంద్ర ప్ర‌భుత్వం త‌మ వ్యూహాల‌ను సిద్దం చేసుకోనుంది. మ‌రో ఏడాది కాలంలో ఏపీలో త‌మ స‌త్తా చాలుతామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్న స‌మయంలో కొత్త గ‌వ‌ర్న‌ర్ ఎంపిక ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

English summary
Biswa Bhushan Harichandan sworn in as Governor of Andhra Pradesh. High court acting chief Justice Praveen Kumar lead the oath. CM Jagan and TDP Cheif Chandra Babu attended the searing ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X