వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరూ చూల్లేదు!: మంత్రి మృణాళినికి దుర్గగుడిలో చేదు అనుభవం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చిన మంత్రి మృణాళికి గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి దంపతులు దర్శనానికి వచ్చిన విషయాన్ని అక్కడి సిబ్బంది గుర్తించలేదు. గర్భాలయంలోకి వీఐపీలు నేరుగా వెళ్లే మార్గం ముగిసి ఉండటంతో కాసేపు మంత్రి అక్కడే నిలబడాల్సి వచ్చింది. ఆ తర్వాత గుర్తించిన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వారిని తీసుకెళ్లారు.

Bitter experience to minister Mrunalini in Krishna district

కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా కొలిచే అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆరో రోజైన గురువారం పెదకళ్లేపల్లిలో శ్రీ మహాలక్ష్మిదేవిగాను, మోపిదేవిలో శ్రీలలిత అమ్మవారుగా, కొక్కిలిగడ్డలో కాత్యాయని దేవిగా భక్తులు పూజలు నిర్వహించారు.

దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రోత్సవాలు మంగళవారం నాడు ఐదో రోజు ఘనంగా ముగిశాయి. పన్నెండేళ్లకు ఓసారి వచ్చే కాత్యాయనిదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు 70వేల మంది వరకూ భక్తులు బుధవారం తరలివచ్చారు.

English summary
Bitter experience to minister Mrunalini in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X